ఏపీలో వైఎస్సార్సీపీ నేతల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చేసిన దుష్ప్రచారమని ఆయన విమర్శించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికలో గులాబీ పార్టీ వ్యూహం ఏంటి...? ఎన్డీయేకు మద్దతిస్తుందా? లేక ఇండియా కూటమికి జై కొడుతుందా? అది ఇది కాదు... మేం న్యూట్రల్ అంటుందా? అలాంటి స్టాండ్ తీసుకుంటే... బరిలో ఉన్న తెలంగాణ బిడ్డకు అన్యాయం చేసినట్టు కాదా? అందుకే ఎటూ తేల్చుకోలేక చర్చించి నిర్ణయం అంటూ ప్రస్తుతానికి సమాధానం దాట వేస్తున్నారా? పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారిందన్నది నిజమేనా?
మారరా... వీళ్ళలో ఇక మార్పు రాదా...? ఎప్పుడూ ఇలాగే తన్నులాటలు, తలకలతో టైంపాస్ చేస్తూ... పార్టీకి బొంద పెడతారా అంటూ ఘాటుగా మాట్లాడుకుంటోందట అక్కడి కాంగ్రెస్ కేడర్. ఎవడైతే నాకేంటి అన్నట్టుగా ఉన్న ఓరుగల్లు రెండు వర్గాల మధ్య సయోధ్య విషయంలో అధిష్టానం కూడా చేతులెత్తేసిందా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ ఉత్సాహం సంతరించుకుంది. నగరంలో భూముల ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటూ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కెపిహెచ్బి కాలనీలో ఎకరా భూమి ధర రూ.70 కోట్లు తాకడం, అలాగే హౌసింగ్ బోర్డుకు చెందిన 7.8 ఎకరాలు రూ.547 కోట్లకు అమ్ముడుపోవడం రియల్ ఎస్టేట్ రంగం ఎంత వేగంగా పుంజుకుంటోందో చూపిస్తోంది.
రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ మ్యూసీ నదికి గోదావరి నీళ్లు తీసుకువెళ్తామన్న వ్యాఖ్యలపై హరీష్ రావు ప్రశ్నించారు.
మార్వాడీ గో బ్యాక్ నినాదం వెనుక కుట్ర ఉందా? అదృశ్య శక్తులేవో వెనకుండి... కావాలని రెచ్చగొడుతున్నాయా? ఎవరో ఏదో.. ఆశించి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో మంట పెడుతున్నారా? ఏవో వ్యక్తిగత వివాదాలకు పొలిటికల్ కలర్ పులిమేసి సెంటిమెంట్‌ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారా? అసలీ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీల వైఖరేంటి?
AV Solutions Scam : హైదరాబాద్‌లో మరో భారీ ఇన్వెస్ట్మెంట్ స్కాం వెలుగుచూసింది. మాదాపూర్‌లో ఆధారంగా పనిచేసిన ఏవి సొల్యూషన్స్ , ఐఐటి క్యాపిటల్స్ పేరుతో పెట్టుబడిదారులను మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం, 3200 మందికి పైగా బాధితుల నుండి సుమారు 850 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. పెట్టుబడులు అన్నీ సురక్షితంగా ఉంటాయని, స్టాక్ మార్కెట్లో పెట్టితే అధిక లాభాలు వస్తాయని మాయమాటలు చెప్పి డిపాజిటర్లను ఆకర్షించారు. Betting Apps […]
ఆన్లైన్ గేమింగ్‌పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. దీనికి పేరు ‘ఆన్లైన్ గేమింగ్ అభివృద్ధి, నియంత్రణ బిల్లు’. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది. దీని ప్రధాన ఉద్దేశ్యం ఆన్లైన్ సోషల్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్‌ను ప్రోత్సహించడం, అలాగే ఆన్లైన్ గేమింగ్‌పై నియంత్రణ తీసుకురావడం.
తెలంగాణలో యూరియా కొరతపై కేటీఆర్ విమర్శలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఈ వారంలోనే రాష్ట్రానికి అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు మంత్రి తెలిపారు.