Hyderabad Rains : హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ మామూలుగా ఉన్నప్పటికీ, సాయంత్రం వచ్చిన వర్షం నగర జీవనాన్ని దెబ్బతీసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ముషీరాబాద్, తార్నాక, లక్డీకాపూల్, కాచిగూడ వంటి పలు ప్రాంతాల్లో వర్షం విరివిగా కురిసి రహదారులు జలమయమయ్యాయి.
వర్షం కారణంగా ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు మాత్రం వర్షం నుంచి తప్పించుకునేందుకు ఫ్లైఓవర్ల కింద ఆశ్రయం పొందారు. కొన్ని చోట్ల వాహనాలు స్టార్ట్ కాక రోడ్ల మధ్యలోనే ఆగిపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది.
India vs Pakistan: హైటెన్షన్ మ్యాచ్ కు సర్వం సిద్ధం.. మొదట బ్యాటింగ్ చేయనున్న పాక్!
ఇక వర్షానికి సంబంధించి అత్యవసర చర్యలు తీసుకోవడానికి హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా నీరు ఎక్కువగా నిలిచిపోయిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ బృందాలు చురుకుగా పని చేశాయి. వర్షపు నీరు నాలాలోకి వెళ్లేలా మ్యాన్‌హోల్స్ తెరిచి నీటిని తరలించే చర్యలు చేపట్టాయి. అయితే మ్యాన్‌హోల్స్ తెరిచి ఉంచితే ప్రమాదకరమవుతుందని ఇప్పటికే ప్రజలకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పష్టంగా హెచ్చరించారు.
మరోవైపు వర్షాలు నగరంలో ఇబ్బందులు సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మరింతగా ఉపయోగించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నగరంలో ఆకస్మిక వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కొనసాగుతుందన్న అంచనాతో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్‌లో అకస్మాత్తుగా కురిసిన వర్షం నగరంలోని సాధారణ జీవనాన్ని దెబ్బతీసినప్పటికీ, సహాయక చర్యలు వేగంగా సాగుతున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండటంతో పెద్దగా నష్టాలు జరగకుండా నివారించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
CM Chandrababu: టీటీడీ భక్తులకు గుడ్‌స్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. 13 ఎకరాల విస్తీర్ణంలో…