వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచకుడు.. విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన తెలుగు టీచర్
కొందరి ఉపాధ్యాయుల తీరు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధించి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్స్ తప్పటడుగులు వేస్తున్నారు. తమ ప్రవర్తనతో, చేష్టలతో అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచార యత్నాలకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా ములుగు (మం) లక్ష్మక్కపల్లి గ్రామంలోని వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచక టీచర్ బాగోతం బట్టబయలైంది. ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం చేశాడు తెలుగు టీచర్. విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
జబర్దస్త్‌లో డాన్స్ చేసిన రోజా.. పవన్ గురించి మాట్లాడే అర్హత లేదు!
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారంపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పీపీపీ పద్ధతిలో చేపట్టిన కాలేజీల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులపై పూర్తి అజమాయిషీ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అన్నారు. ఇక, వైసీపీ హయాంలో నిర్మించిన ఏ ఒక్క భవనం కూడా పూర్తి చేయలేదు అని ఆరోపించారు. అలాగే, విశాఖలోని రుషికొండపై ఆదాయం వచ్చే రిసార్ట్స్ ను పడగొట్టి రాజప్రసాదాలు నిర్మించారు అని ఎద్దేవా చేశారు. అయితే, పీపీపీ మోడ్ ను ప్రతిపక్ష నేతలు అర్థం చేసుకోవాలి అని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.
కన్నడలో కొత్త ట్రెండ్ స్టార్ట్ చేయబోతున్న కాంతార చాప్టర్-1 మేకర్స్
కన్నడ సినిమా చరిత్రలో మలుపుతిప్పిన చిత్రం ‘కాంతార’. కేవలం రూ.15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన వెంటనే పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించి, వరల్డ్‌వైడ్‌గా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రా నేటివిటీ, భక్తి – భయం కలిసిన ఆ విభిన్నమైన కథనంతో ప్రేక్షకులను అబ్బురపరిచిన ఈ చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ రూపంలో ‘కాంతార చాప్టర్-1’ రాబోతోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రిషబ్ శెట్టి స్వయంగా తెరకెక్కిస్తుండగా, ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా, మేకర్స్ అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమోషన్ల కోసం ప్రత్యేక స్ట్రాటజీలు సిద్ధం చేస్తూ, ఆడియన్స్‌లో అంచనాలను ఇంకా పెంచుతున్నారు. అదే సమయంలో ట్రైలర్ సహా ప్రమోషనల్ కంటెంట్‌తో సినీ ప్రియుల్లో ఉన్న అంచనాలకు ఇంకా పెంచాలని మేకర్స్ చూస్తున్నారు. అయితే తాజాగా..
ఫీల్ అవకండి డార్లింగ్స్.. అక్టోబర్ నుండి రెబల్ టైమ్ స్టార్ట్..
ఈ ఏడాది ఫ్యాన్స్‌ను గట్టిగానే హర్ట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. ఇయర్లీ మినిమం వన్.. మాగ్జిమం టూ ఫిల్మ్స్‌తో వస్తానని గతంలో ప్రామిస్ చేసాడు రెబల్ స్టార్. కానీ ఈ ఏడాది తన సినిమా రిలీజ్ ను స్కిప్ చేశాడు. రాజా సాబ్ కోసం ఇయర్ స్టార్టింగ్ నుండి ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు నీరసం తెప్పించాడు. ఇయర్ ఎండింగ్‌లోనైనా డార్లింగ్ రాక ఉంటుందని ఆశపడితే నెక్ట్స్ ఇయర్ జనవరిలో మూవీ రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తెలియజేసాడు. తన సినిమాలు రిలీజ్ లు డిలే అవుతుండడం కారణంగా ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇవ్వలేకపోయానని గ్రహించిన ప్రభాస్ తాజాగా మిరాయ్‌లో వాయిస్ ఓవర్ ద్వారా చిన్న ట్రీట్ ఇచ్చి ఖుషీ చేశాడు. చిన్న సినిమాలకు సపోర్ట్ చేస్తూ బూస్టర్ అయ్యాడు. అలాగే కన్నప్పలో రుద్రగా 15 నిమిషాలు కనిపించి సినిమా భారీ ఓపెనింగ్స్‌కు కారణమైన డార్లింగ్. డార్లింగ్ నుండి సినిమాలు రాకపోయినా అప్ కమింగ్ ఫిల్మ్స్ అప్డేట్స్ లోడ్ కాబోతున్నాయి. అక్టోబర్ మంత్ మొత్తం ప్రభాస్ ఆక్యుపై చేయబోతున్నాడు. కాంతారా పార్ట్ 1 సినిమాకు రాజా సాబ్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ప్రీరిలీజ్ ఈవెంట్స్‌తో సందడి చేయబోతున్నాడు. అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇవే కాదు హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ నుండి కూడా ట్రీట్స్ ఉండబోతున్నాయన్నది టాక్. అలాగే అక్టోబర్ 31న థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ రాబోతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ను పలకరించేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నాడు ప్రభాస్.
జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్‌లో ఫోటోను అప్లోడ్ చేసిన యువకుడు.. అకౌంట్ నుంచి రూ.70 వేలు మాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బురిడీ కొట్టిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని సంబరపడిపోతున్నారు. 3డీ ప్రింట్, నానో బనాన ఇలా రకరకాలుగా ఫోటోలను ఎడిట్ చేస్తుంది జెమినీ ఏఐ. అయితే జెమినీ ఏఐ ట్రెండింగ్ ఫోటో ఎడిట్ యాప్‌తో యువకుడికి రూ.70 వేల నష్టం వాటిల్లింది. ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ ఫోటో ఎడిట్ యాప్‌తో ఓ యువకుడు కష్టార్జిత డబ్బును కోల్పోయిన సంఘటన సంచలనం రేపింది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల “జెమినీ” అనే ఫోటో ఎడిట్ యాప్‌లో తన ఫోటోను అప్లోడ్ చేశాడు. కొద్దిసేపటికే అకౌంట్ నుంచి రూ.70 వేల రూపాయలు మాయం కావడంతో షాక్‌కు గురయ్యాడు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
వైసీపీపై బీజేపీ చీఫ్ పరోక్ష విమర్శలు.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోసి కూటమికి అవకాశం ఇచ్చారు..
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి రాక ముందు అవినీతి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడిచేది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా తెలిపారు. వైసీపీ అసమర్థత, అస్తవ్యస్తమైన ప్రభుత్వాన్ని కూలదోసి కూటమిని ఎంచుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయన తెలిపారు. మిగిలిన రాజకీయ పార్టీలు మాదిరిగా ఏ ఎండకు ఆ గోడకు పడితే.. బీజేపీ సిద్ధాంతం మీద, కేడర్ మీద ఆధారపడుతోంది అని తేల్చి చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని కేంద్రమంత్రి జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.
ప్రపంచాన్ని నివ్వెరపరిచిన రష్యా.. హైపర్‌సోనిక్ క్షిపణి సక్సెస్
నిజంగా రష్యా ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. ‘జపాడ్-2025’ సైనిక విన్యాసాల సందర్భంగా మాస్కో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటైన హైపర్సోనిక్ కింజాల్ క్షిపణిని విజయవంతం పరీక్షించింది. ఈ క్షిపణి వేగం ధ్వని వేగం కంటే 10 రెట్లు ఎక్కువ. దీనిని ఆపడం దాదాపు అసాధ్యమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రష్యన్ వార్తా సంస్థ ఇంటర్‌ఫ్యాక్స్ కథనం ప్రకారం.. ఈ క్షిపణిని రష్యా మిగ్-31 ఫైటర్ జెట్‌లలో అమర్చారు. ఈ విమానాలు బారెంట్స్ సముద్రం మీదుగా నాలుగు గంటల పాటు ప్రయాణించాయి. నేలపైనే కాకుండా ఆకాశంలో, సముద్రంలో కూడా ఎటువంటి సవాలు నుంచైనా తమ క్షిపణులు వెనక్కి తగ్గవని రష్యా ప్రపంచానికి స్పష్టం చేసింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ ఫోకస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వేంకటస్వామి హాజరుకానున్నారని సమాచారం. పార్టీ అభ్యర్థి ఎంపిక, ఎన్నికల ప్రచారం, స్థానిక నేతల సమన్వయం వంటి అంశాలపై ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పష్టమైన దిశానిర్దేశం ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మావోయిస్టులకు మరోదెబ్బ.. గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు అరెస్ట్
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు మరోసారి విజయవంతమైన ఆపరేషన్ చేపట్టారు. తిర్కామేట అటవీప్రాంతంలో కూంబీంగ్ నిర్వహించిన సమయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న మావోయిస్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వ్యక్తి బాంరగడ్ దళానికి చెందిన శంకర్ భీమ మహాకా. ఇతనిపై రూ.2 లక్షల రివార్డ్ ఉంది. దహనం, హత్యలు, మందుపాతరలు వంటి పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అదనంగా, ఎన్ఐఏ విచారణ జరుపుతున్న హత్యకేసులో కూడా ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. గడ్చిరోలి పోలీసులు 2022 సంవత్సరం నుండి ఇప్పటి వరకు మొత్తం 109 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసిన విషయం గమనార్హం. స్థానిక భద్రతా బలగాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబీంగ్ ఆపరేషన్లను మరింత బలోపేతం చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్ ముఠాలపై ఉక్కుపాదం
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ముఠాలపై పోలీసులు దాడులు మరింత వేగవంతం చేశారు. ఈగిల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లలో భారీగా డ్రగ్స్ స్వాధీనం అయ్యాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నాలుగు మంది డ్రగ్ పేడ్లర్లను అరెస్టు చేసి 91 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకుని మరో 5 కేజీల గంజాయిని స్వాధీనం చేశారు. ఇదే సమయంలో వరంగల్‌లో కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో మూడు మందిని అదుపులోకి తీసుకొని 32 కేజీల గంజాయిని పట్టుకున్నారు. స్వాధీనం చేసిన గంజాయి విలువ సుమారు 8 లక్షల రూపాయలని పోలీసులు వెల్లడించారు.