CM Revanth Reddy :ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపు చర్చలపై కీలక మలుపు
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సీఎం రేవంత్ కీలక చర్చలు
- బీఆర్‌ఎస్ కాలంలో సిద్ధమైన విజిలెన్స్ రిపోర్ట్ వెలికితీత
- ప్రైవేట్ కాలేజీల అవకతవకలపై విద్యార్థి సంఘాల ఆందోళన
- నకిలీ సిబ్బంది, సౌకర్యాల లోపంపై ప్రభుత్వ ఆరా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపు అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంలో సీఎం ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కలిసి కీలకంగా చర్చించారు. ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలంలో సిద్ధమైన విజిలెన్స్ రిపోర్ట్‌ను తిరిగి పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రిపోర్ట్‌లో అనేక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా, విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని లాభాల కోసం వినియోగించుకున్నట్లు స్పష్టంగా తేలినట్టు తెలుస్తోంది.
Donald Trump: ఇజ్రాయెల్‌పై ట్రంప్ ఫైర్.. ఖతార్‌తో జాగ్రత్త అంటూ హెచ్చరిక
Also Read
- Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
విద్యార్థి సంఘాలు కూడా ఈ రిపోర్ట్‌ను వెంటనే బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాలేజీలు విద్యా ప్రమాణాలను విస్మరించి బకాయిల చెల్లింపుల పేరుతో ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయంటూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. నకిలీ సిబ్బందిని చూపించి అనుమతులు పొందడం, సౌకర్యాలు కల్పించకుండా కోట్లు దాచుకోవడం, తనిఖీలు తూతూమంత్రంగానే జరగడం వంటి అంశాలను వారు ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా, కోట్ల రూపాయల నిధులు కాలేజీ యాజమాన్యాల మధ్య చేతులు మారుతున్నాయంటూ ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్‌ను సమగ్రంగా పరిశీలించేందుకు సిద్ధమవుతోంది. అవసరమైతే అక్రమాలకు పాల్పడిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవచ్చని సంకేతాలు ఇస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుల చర్చలు ఈసారి ఎటువంటి నిర్ణయానికి దారితీస్తాయో విద్యార్థులు, కాలేజీలు, తల్లిదండ్రులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
Waqf Act : వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పు
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?