Telangana : మీ వాహనానికి కొత్త నంబర్ ప్లేట్ లేకపోతే ఏమవుతుందో తెలుసా.?
- పాత వాహనాలకు తప్పనిసరి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు
- సెప్టెంబర్ 30లోపు మార్చుకోకపోతే కఠిన చర్యలు
- వాహన రకాన్నిబట్టి HSRP ధరలు ఎంత?
- నకిలీ ప్లేట్లను అరికట్టే నూతన నిబంధన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana : తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్ట్రేషన్ పొందిన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) తప్పనిసరిగా అమర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రకటించింది. గడువు లోపు నంబర్ ప్లేట్లు మార్చుకోకపోతే వాహన యజమానులపై కేసులు నమోదు చేయడమే కాకుండా, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి సేవలు కూడా నిలిపివేయబడతాయని రవాణాశాఖ హెచ్చరించింది.
కొత్త నంబర్ ప్లేట్ అమర్చే బాధ్యత పూర్తిగా వాహన యజమానిదేనని నిబంధనలో పేర్కొన్నారు. ఇకపై HSRP లేని వాహనాలను అమ్మడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా అనుమతించబడదు. ప్లేట్ల ధర వాహనం రకాన్నిబట్టి మారుతుంది. ఉదాహరణకు, టూ వీలర్లకు సుమారు రూ.320 నుంచి రూ.380 వరకు, ఫోర్ వీలర్లకు రూ.590 నుంచి రూ.700 వరకు ఖర్చవుతుంది. ఆటో రిక్షాలకు రూ.450 నుంచి రూ.550, కమర్షియల్ వాహనాలకు రూ.1,100 నుంచి రూ.1,500 వరకు చార్జీలు ఉంటాయి. అదనంగా హోమ్ ఇన్‌స్టలేషన్ లేదా డోర్ స్టెప్ సర్వీస్ కోరుకుంటే వేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. కలర్ స్టిక్కర్ రూ.50 నుంచి రూ.100 వరకు ఉంటుంది.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ఈ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల అమలుకు ముఖ్య కారణాలు నకిలీ నంబర్ ప్లేట్లను నిరోధించడం, వాహన దొంగతనాలను అరికట్టడం, రోడ్డు భద్రతను పెంపొందించడం. ఈ ప్లేట్లలో ప్రత్యేకమైన హోలోగ్రామ్, IND మార్కింగ్ ఉండటంతో వాటిని కాపీ చేయడం అసాధ్యం. అంతేకాకుండా ఇవి కేంద్ర డేటాబేస్‌కు అనుసంధానమై ఉండటంతో వాహనాలను ట్రాక్ చేయడం సులభమవుతుంది. దీని వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల్లో సమస్యలు రాకుండా ఉంటాయి.
HSRP ప్లేట్ల కోసం వాహన యజమానులు డీలర్‌షిప్‌లు లేదా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 30 గడువు లోపు తప్పనిసరిగా కొత్త నంబర్ ప్లేట్ అమర్చుకోవాలని రవాణాశాఖ స్పష్టంచేసింది.
CM Chandrababu: టీటీడీ భక్తులకు గుడ్‌స్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. 13 ఎకరాల విస్తీర్ణంలో…
తాజావార్తలు
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!