Hyderabad : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మరోసారి బూమ్ రాబోతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జరగబోయే ప్రభుత్వ భూముల వేలం ఈ బూమ్‌కు నాంది పలకనుంది. వచ్చే నెలలో జరిగే ఈ-వేలంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకే అవకాశముందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రిజర్వ్ ధరను ఎకరానికి ₹101 కోట్లుగా నిర్ణయించింది. అయితే ఈ ధర వేలంలో కనీసం ₹150 కోట్లకు చేరుతుందని, అంతకంటే ఎక్కువ పలికే అవకాశమూ ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Narendra Modi : ప్రధాని మోడీ 75వ పుట్టిన రోజు.. దేశవ్యాప్తంగా సేవా పక్వాడ
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు, ప్లాట్ నంబర్ 15A/2లో 7.67 ఎకరాలు కలిపి మొత్తం 18.67 ఎకరాలను ప్రభుత్వం వేలం వేయనుంది. ఈ కోసం రిజిస్ట్రేషన్ ఫీజును ₹1,180గా, బిడ్ డాక్యుమెంట్ ఫీజును ఒక్కో ప్లాట్‌కు ₹10 లక్షలుగా (GST అదనంగా) నిర్ణయించింది. బిడ్ దాఖలు చేసేందుకు గడువు అక్టోబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు, ల్యాండ్ విజిటింగ్‌కి అక్టోబర్ 4 వరకు అవకాశం కల్పించారు.
వేలం అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ₹2,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులను తగ్గించుకోవడానికి ఇది కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.