Nacharam: హైదరాబాద్ నగరంలోని నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)లో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుని కలకలం రేపింది. 9వ తరగతి చదువుతున్న రిషాంత్ రెడ్డి అనే విద్యార్థి పుట్టినరోజు వేడుకల్లో తోటి విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. విద్యార్థి తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం, ర్యాగింగ్ సమయంలో తోటి విద్యార్థులు రిషాంత్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా, అతని ప్రైవేట్ పార్ట్స్‌పై తన్నినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో విద్యార్థి రక్తస్రావానికి గురైనా, పాఠశాల యాజమాన్యం పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Yellamma : ఎల్లమ్మ కథకు తెలుగులో హీరో దొరకట్లేదా..?
ఈ ఘటనపై బాధిత విద్యార్థి తల్లితండ్రులు నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ర్యాగింగ్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ర్యాగింగ్ వంటి ఘటనలను అరికట్టడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ఈ ఘటనతో పాఠశాల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Manchu Manoj: ఎన్నో సంవత్సరాల తర్వాత మా అమ్మ కళ్ళల్లో ఆనందం చూశా