KTR : ఎల్అండ్‌టి మెట్రో ప్రాజెక్టు నుంచి వెనక్కి.. సీఎం బెదిరింపులే కారణం
- ఎల్అండ్‌టి మెట్రో నుంచి తప్పుకోవడానికి సీఎం బెదిరింపులే కారణమని కేటీఆర్ ఆరోపణ
- ఎమ్మార్ ఆస్తుల అమ్మకాల్లో కమిషన్ వసూలు చేస్తున్నారని ఆరోపణలు
- “పీసీసీ, ముఖ్యమంత్రి పదవులు కొన్నాడు” .. కేటీఆర్ విమర్శలు
- ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను బీజేపీకి అమ్మేశాడని ఘాటు ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్‌టి కంపెనీ తప్పుకోవడానికి సీఎం రెవంత్ రెడ్డి వ్యవహార శైలి, బెదిరింపులే కారణమని ఆయన ఆరోపించారు. కేటీఆర్ ప్రకారం, ఎల్అండ్‌టి సంస్థపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, ముడుపుల కోసం వేధించడంతో కంపెనీ కార్యకలాపాలను రాష్ట్రం నుంచి వెనక్కి తీసుకుంటోందని చెప్పారు. “ఒకప్పుడు ఎల్అండ్‌టి సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను జైల్లో పెడతానని బెదిరించాడు. ఈ తరహా మాటలు, చర్యలు ప్రైవేట్ కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేస్తాయి. ప్రభుత్వానికి బాధ్యత లేకపోతే, కంపెనీలకు ఎందుకు ఉంటుంది?” అంటూ ప్రశ్నించారు.
Leica కెమెరా, 5,500mAh బ్యాటరీ, 1336 సింగిల్ కోర్ స్కోరుతో రాబోతున్న Xiaomi 15T!
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
కేటీఆర్ మరో కీలక వ్యాఖ్య చేస్తూ, త్వరలోనే రేవంత్ రెడ్డి వివాదాస్పద ఎమ్మార్ సంస్థ ఆస్తులను అమ్మకానికి పెట్టబోతున్నారని తెలిపారు. ఆ వ్యవహారంలో ఎంత కమిషన్ తీసుకున్నారో త్వరలోనే వెలుగులోకి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాదు, గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను ముందుకు తెచ్చి, వాటిని సెటిల్ చేసుకుంటూ భారీగా ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు.
“అన్ని కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని, వస్తువులను అమ్ముతూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఈ స్థాయిలో వ్యవహరించడం దుర్మార్గం తప్ప మరొకటి కాదు” అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కేవలం సీఎం రేవంత్‌పైనే కాకుండా, కాంగ్రెస్ పార్టీపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. “హైదరాబాద్‌లో ఉంటే మూసీ నదిలో ఇల్లు కడుతున్నారు.. నిజమైన హైడ్రా అయితే బయటికి ఎందుకు వెళ్లడం లేదు? కాంగ్రెస్ చేయి గుర్తు తీసివేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ ఎద్దేవా చేశారు. అదేవిధంగా, కాంగ్రెస్‌లోని అంతర్గత వ్యవహారాలను ప్రస్తావిస్తూ, “పీసీసీ పదవి, ముఖ్యమంత్రి పదవులు డబ్బు పెట్టి కొన్నాడు. అంతేకాదు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను బీజేపీకి అమ్మేశాడు” అని కేటీఆర్ ఆరోపించారు.
Nacharam: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ర్యాగింగ్ కలకలం.. ప్రైవేట్ పార్ట్స్‌పై తన్ని..!
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!