Bhatti Vikramarka : పాత పాపాలు.. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై భట్టి కీలక వ్యాఖ్యలు.!
- పేద విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యం : భట్టి విక్రమార్క
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై తక్షణ సాయం ₹600 కోట్లు
- మిగిలిన బకాయిలు విడతల వారీగా చెల్లింపు హామీ
- ప్రభుత్వ నిర్ణయంతో కళాశాలల బంద్ విరమణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka : పేద విద్యార్థుల భవిష్యత్తుకే ప్రాధాన్యత: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, పేద విద్యార్థుల భవిష్యత్తుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని చిన్నాభిన్నం చేసి, బకాయిల భారాన్ని తమపై మోపిందని ఆరోపించారు.
“ఆ విచ్ఛిన్నాన్ని సరిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది” అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న బకాయిల నుండి రూ. 600 కోట్లు త్వరితగతిన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మిగిలిన బకాయిలను ప్రతినెలా కొంత చొప్పున చెల్లిస్తూ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి యాజమాన్యాలు సానుకూలంగా స్పందించి బంద్‌ను విరమించాయని తెలిపారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
NTR – Rishab Shetty: రిషబ్ శెట్టి సినిమాలో ఎన్టీఆర్?
చర్చల సందర్భంగా, కళాశాల యాజమాన్యాలు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరగా, ప్రభుత్వం అందుకు అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కళాశాల యాజమాన్యాల ప్రతినిధులతో కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే.. కళాశాల యాజమాన్యాల సంఘాల సమాఖ్య అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ, “పాత ప్రభుత్వం చేసిన పాపాలు మా నెత్తిన బడినప్పటికీ, మా యందు దయతలచి రూ. 600 కోట్లు విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు” అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు, కళాశాలలకు కొంత ఊరట లభించింది. భవిష్యత్తులో ఈ సమస్య పూర్తిగా పరిష్కారమై విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విద్యాభ్యాసం కొనసాగుతుందని ఆశిద్దాం.
Manchu Lakshmi : ఆ హీరో మాజీ భార్యకు కావాలనే ఛాన్సులు ఇవ్వట్లేదు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!