ఆ మాజీ మంత్రికి తత్వం బోథపడిందా? అందలం ఎక్కించిన పార్టీనే అధికారంలో లేనప్పుడు లైట్ తీసుకున్నదానికి ఫలితం అనుభవిస్తున్నారా? అందుకే…. పొలిటికల్ చాణక్యం తెలిసిన సదరు లీడర్ ఇప్పుడు ప్లాన్ బీ అమలు చేస్తున్నారా? అందుకే ఇప్పుడు పార్టీ పెద్దలకు వంగి వంగి దండాలు పెడుతూ రండి… రండి… రండి… దయచేయండని స్వాగతాలు పలుకుతున్నారా? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఏంటా కథ? గంటా శ్రీనివాసరావు….భీమిలి ఎమ్మెల్యే. మాజీమంత్రి. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఉత్తరాంధ్ర నేత. […]
తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ శాఖకు కొత్త డైరెక్టర్ జనరల్‌గా విక్రమ్ సింగ్ మాన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఐపీఎస్ అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు 31తో పదవీ విరమణ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా కొత్త పద్ధతులతో పోలీసులను తప్పుదోవ పట్టిస్తోంది. సాధారణంగా కనిపించే వస్తువుల మాటున డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ యువతను బారిన పడేస్తోంది. పుస్తకాలు, కాస్మెటిక్స్, తినుబండారాలు, ఫుడ్ ఆర్టికల్స్ వంటి వస్తువుల మధ్య దాచిపెట్టి ముఠాలు డ్రగ్స్ పంపిణీ చేస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వంలో ఏదీ దాగే పరిస్థితి లేదా? దాచాలంటే దాగదులే... దాగుడు మూతలు చెల్లవులే అన్నట్టుగా ఉందా వ్యవహారం? అత్యంత కీలకమైనది, టాప్ సీక్రెట్ అనుకున్న రిపోర్ట్ కూడా ప్రతిపక్షం చేతికి అందిందా? లీకు వీరులు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారా?
పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని.. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు.
పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. బోరున విలపించిన కెప్టెన్ సల్మాన్ అఘా! దుబాయ్ గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు ఘోర అవమానం జరిగింది. అఫ్ఘానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న పాక్ సారథిని ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అటు నవ్వలేక, ఇటు ఏడ్వలేక అలా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని వదలరుగా అంటూ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, సెప్టెంబర్ […]
హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందడంతో ఈ ఖాళీ ఏర్పడింది.
కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడడమే తమ ప్రధాన బాధ్యత అని తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ శాఖా డీజీ నాగిరెడ్డి స్పష్టం చేశారు.
ఢిల్లీ లో జరిగిన సమావేశంలో జీఎస్టీ రేషనలైజేషన్ (GST Rationalisation) అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ సమావేశానికి ఎనిమిది రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రేట్ రేషనలైజేషన్ పేరుతో రాష్ట్రాలకు భారీ రెవెన్యూ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Traffic Diversion : నగరంలో గణేష్ నిమజ్జన మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. నేటి (ఆగస్టు 29) నుండి సెప్టెంబర్ 5 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు వాహన రాకపోకలపై పరిమితులు ఉండనున్నాయి. పోలీసుల ప్రకారం, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో […]