Off The Record : తెలంగాణ కమలంలో కమిటీ మంటలు ఇంకా చల్లారలేదా?
- తెలంగాణ బీజేపీలో అసంతృప్తులు, ఆవేదనలు
- స్టేట్ కమిటీలో పదవులు దక్కలేదన్న బాధ
- దశాబ్దాలుగా అంటిపెట్టుకుని ఉండి ఏం ప్రయోజనమన్న ప్రశ్నలు
- స్థాయికి తగ్గ పదవి రాలేదని మరి కొందరి అసహనం
- ఆఫీస్ మెట్లు కూడా ఎక్కని పాత ప్రధాన కార్యదర్శులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కమలంలో కమిటీ మంటలు ఇంకా చల్లారలేదా? సీనియర్స్ ఎక్కువ మంది ఇప్పటికీ అలకపాన్పులు దిగలేదా? పదవులు రాలేదన్న బాధ ఒకరిదైతే… వచ్చిన వాళ్ళతో సైతం అసంతృప్తులు పెరుగుతున్నాయా? గతంలో రెగ్యులర్‌గా పార్టీ ఆఫీస్‌కు వచ్చిన వాళ్ళు సైతం ఇప్పుడు గేటు దగ్గరికి కూడా ఎందుకు రావడం లేదు? పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీ ప్రకటన తర్వాత అసంతృప్తుల పర్వానికి తెర లేచింది. ఆ విషయమై పార్టీలో ఆనందించే వారికంటే… ఇప్పుడు ఆవేదనతో ఉన్న వాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉందట. దశాబ్దాలుగా పార్టీ కోసం సేవ చేస్తున్నా… కనీస గుర్తింపు దక్కలేదని సీనియర్స్ చాలా మంది నారాజ్‌గా ఉన్నట్టు సమాచారం. తమ త్యాగాలకు గుర్తింపు లేకుండా పోతోందని సీనియర్స్ చాలా మంది లోలోపల మథనపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వరు, పార్టీ పదవుల్లో ఛాన్స్ ఇవ్వరు, ఇక దశాబ్దాలుగా అంటిపెట్టుకుని ఉండి ఏం ప్రయోజనం అన్నది వాళ్ళ క్వశ్చన్. చేస్తున్న పనికి గుర్తింపుగా మాత్రమే పార్టీ పదవులు అడుగుతున్నాం తప్ప… స్టేటస్ కోసం కాదంటున్నారట సదరు సీనియర్స్. రాష్ట్ర కమిటీలో ఛాన్స్ కోసం చాలా మంది నాయకులు కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూశారు. అలాగే… పాత కమిటీలో ఉన్న కొందరు కూడా… తమకు ఢోకాలేదని భావించారు. కానీ… ఫైనల్ లిస్ట్ బయటికి వచ్చాక అలాంటి వాళ్ళంతా షాక్ అయినట్టు తెలిసింది.
పదవులు దక్కని వాళ్ల అసంతృప్తి అలా ఉంటే… దక్కిన వాళ్ళ లెక్కలు మరోలా ఉన్నాయి. తమ స్థాయికి తగ్గ పోస్ట్ రాలేదన్నది కొందరి అసహనంగా తెలుస్తోంది. ప్రకాష్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు లాంటి నేతలు చివరికి పార్టీ కార్యాలయానికి కూడా వెళ్ళడం లేదట. నిన్న మొన్నటిదాకా సంస్థఆగత కార్యకలాపాల్లో చురుగ్గా పని చేసిన వారు కూడా ఇప్పుడు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ… సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. గత కమిటీలో పనిచేసిన ప్రధాన కార్యదర్శులు ఇప్పుడు పార్టీ మెట్లు కూడా ఎక్కడం లేదట. అప్పుడు చెప్పిన పనల్లా చేశాం.. చేతి చమురు వదిలించుకుని సొంత ఖర్చులతో తిరిగాం… తీరా కమిటీ వేసేటప్పుడు మాత్రం మా కులం అడ్డొచ్చిందంట… అసలు ఇదేం పద్ధతి, పనులు చేయించుకునే రోజున మా కులం గురించి తెలియ లేదా? అది గుర్తుకు రాలేదా అంటూ ఎక్కువ మంది ఫైరవుతున్నట్టు సమాచారం. ఎంత చేసినా… ఇంతేనా అన్న ఆవేదన ఎక్కువ మందిలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు తెలంగాణ కాషాయదళంలో కొత్త చర్చ మొదలైంది. పని చేసి పదవులు రానివాళ్ళని అధినాయకత్వం సముదాయిస్తుందా? లేక మీ ఖర్మ అంటూ వదిలేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల పై పట్టున్న నేతలకు అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం కూడా బీజేపీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
Also Read
- Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..
- CM Chandrababu: రెబల్స్‌కు పార్టీలో నో ఎంట్రీ.. చంద్రబాబు సంచలన నిర్ణయం
- CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
- CPS to OPS Conversion: ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. డెడ్‌లైన్ ఎప్పుడంటే..?
- Tags
- bjp
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: ‘సీన్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ!
-
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
-
Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..
-
Damodar Raja Narasimha : హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
-
Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న ‘రణబాలి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!