Suryakumar Yadav: పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ ఎంట్రీపై బాంబు పేల్చిన కెప్టెన్ సూర్యకుమార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉత్కంఠ బరితంగా సాగనుంది. ఈ నేపథ్యంలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంట్రీపై అభిమానులు ఎదురు చూస్తున్నారు. టీమిండియాకు కీలక ఓపెనర్‌గా మారిన అభిషేక్ శర్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న సందేహం ఇంకా కొనసాగుతోంది. కడుపు ఇన్‌ఫెక్షన్, నొప్పి కారణంగా అభిషేక్ రెండు రోజుల పాటు ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందాడు. బుధవారం డిశ్చార్జ్ అయినా.. గురువారం ఢిల్లీలోని కోట్లా మైదానంలో జట్టు ప్రాక్టీస్ కి రాలేదు. ఈ అంశపై నమీబియాపై అద్భుతంగా బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. “నేను మాట్లాడినంతవరకు అభిషేక్ బాగానే ఉన్నాడు. కొంత ప్రాక్టీస్ కూడా చేశాడు. తాను త్వరలో మ్యాచ్‌కు సిద్ధమవుతానని చెప్పాడు.” అని వెల్లడించాడు.
READ MORE: Tamil Nadu: ఎన్నికల వేళ మహిళలకు బొనాంజా.. ఖాతాల్లో రూ.5 వేలు జమ
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఈ అంశంపై ఇప్పటికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ అనంతరం మాట్లాడుతూ.. “అభిషేక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు మిస్ కావచ్చు” అని చెప్పాడు. ఈ వ్యాఖ్యలతో పాకిస్థాన్ మ్యాచ్‌కు అభిషేక్ ఎంట్రీపై సందిగ్ధం తీవ్రమైంది. అభిషేక్ లేకపోవడంతో నమీబియా మ్యాచ్‌లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా దిగారు. అయితే పాకిస్థాన్ వంటి కీలక మ్యాచ్‌లో అభిషేక్ లాంటి దూకుడు ఆటగాడు జట్టుకు చాలా అవసరం. ఇలాంటి సందర్భంలో యాజమాన్యం, కోచ్‌లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కడుపు ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉంటే శరీరంలో నీరు తగ్గి బరువు కూడా తగ్గిపోతుంది. అలాంటి పరిస్థితిలో మళ్లీ పూర్తి స్థాయి శక్తి, సహనం రావడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
READ MORE: Mega Twins : రామ్ చరణ్ ఉపాసనల ట్వీన్స్ పేర్లు ఇవే.. స్వయంగా వెల్లడించిన రామ్ చరణ్
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!