Cyber Fraud : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వరుస దాడుల్లో పలు ఆన్‌లైన్ మోసగాళ్లను పట్టుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తూ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. తాజాగా పంజాబ్‌లో సంజీవ్ కుమార్ (49) అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయన IMPV PRO యాప్ ద్వారా ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసగట్టినట్లు బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన 69 ఏళ్ల పూజారి నుంచి ఆయన రూ.1.23 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ లాభాలు చూపిస్తూ పెట్టుబడులు పెడితే అధిక రాబడులు వస్తాయని నమ్మబలికాడు. మొదట చిన్న లాభాలు చూపించి విశ్వాసం పొందిన తర్వాత పెద్ద మొత్తాలు డిపాజిట్ చేయించాడు. చివరికి పెట్టుబడినే తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడు. అతని వద్ద నుంచి పోలీసులు రెండు మొబైల్ ఫోన్లు, ఒక చెక్‌బుక్, అలాగే Sanjeev Trading Co. స్టాంప్ స్వాధీనం చేసుకున్నారు. సంజీవ్‌పై తెలంగాణలో ఒకటి, దేశవ్యాప్తంగా ఐదు కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
No Fly Zone : తెలంగాణ సెక్రటేరియట్ ఇక ‘నో-ఫ్లై జోన్’
ఇదే సమయంలో మరో ఆపరేషన్‌లో పోలీసులు ఇనమ్దార్ వినాయక రాజేంద్ర @ నిఖిల్, రిషి తుషార్ అరోతే @ విక్రంథ్ అనే ఇద్దరిని పట్టుకున్నారు. వీరు కూడా ఫేక్ ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కీమ్స్ నడుపుతూ సుమారు రూ.32 లక్షలు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా లింకులు, వాట్సాప్ గ్రూపుల ద్వారా బాధితులను ఆకర్షించేవారు. IPOలు, స్టాక్ ట్రేడింగ్ నోట్లు చూపించి ఎక్కువ డిపాజిట్లు చేయించేవారు. మొదట ఫిక్టివ్ ప్రాఫిట్స్ చూపించి నమ్మకం కలిగించి, డబ్బులు పెడితే విత్‌డ్రా చేయకుండా బ్లాక్ చేసి అదనపు ఫీజులు, కరెన్సీ కన్వర్షన్ పేరుతో మరిన్ని డబ్బులు లాక్కోవడమే వీరి మోసం పద్ధతి. నిఖిల్ తన బ్యాంక్ ఖాతాలు, ఇతరుల ఖాతాలను ఈ మోసాల కోసం అందజేసి కమిషన్ తీసుకున్నాడు. విక్రంథ్ మాత్రం బైనాన్స్ వాలెట్లు సృష్టించి, ఫ్రాడ్ మనీని USDTలోకి మార్చి ఇతరుల వాలెట్లకు పంపేవాడు. వీరి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, చాట్స్, బైనాన్స్ ట్రాన్సాక్షన్ వివరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాక, హర్యానాలో కూడా మరో పెద్ద మోసం బయటపడింది. నిఖిల్ తివారి అనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆయన ఫెడెక్స్ పేరుతో నకిలీ పార్సిల్ ఫ్రాడ్ చేసి, ఒక వైద్యుడిని రూ.1.23 కోట్లు మోసగట్టాడు. నకిలీ పోలీసుల ముసుగులో వీడియో కాల్‌లు చేసి, పోస్టాఫీస్ పేరుతో నకిలీ పార్సిల్‌లు ఉన్నాయని బెదిరించాడు. ఫైనాన్షియల్ వెరిఫికేషన్ పేరుతో డబ్బులు వసూలు చేసుకున్నాడు. అతని వద్ద నుంచి కూడా ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలో మరో కేసులోనూ అతడి ప్రమేయం బయటపడింది.
ఈ వరుస అరెస్టులతో సైబర్ క్రైమ్ పోలీసులు మోసగాళ్ల నెట్‌వర్క్‌ను ఒకొక్కటిగా బట్టబయలు చేస్తున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్, ఫేక్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా లింకులు, బోగస్ పార్సిల్‌ల పేరుతో మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Uttam Kumar Reddy : అంచనాలు లేనివేళ ఖర్చు లెక్కలు ఎలా..? హరీష్ రావు గణితం కొత్త మ్యాజిక్.!