Local Languages in Public Sector Banks: బ్యాంక్ ఉద్యోగులు స్థానిక భాషలను ఎందుకు నేర్చుకోలేకపోతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. లోకల్ లాంగ్వేజ్‌ల్లో మాట్లాడలేని సిబ్బందిని కస్టమర్ ఫేసింగ్ జాబుల్లో కూర్చోబెట్టొద్దని సూచించారు. సౌతిండియాలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఉద్యోగులు ప్రజలను హిందీలో మాట్లాడాలని అడుగుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Bahubali Producer Shobu Yarlagadda Exclusive Interview: టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన మూవీ ‘బాహుబలి’. ఈ రిస్కీ ప్రాజెక్టును డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి మధ్యలోనే వదిలేద్దామనుకున్నారా అంటే ‘అవును’ అని నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు. అయితే జక్కన్న ఈ కఠిన నిర్ణయానికి ఎందుకు వచ్చారు?. దీనికి శోభు యార్లగడ్డ రియాక్షన్ ఏంటి అనే విషయాలు ఆసక్తికరం.
SBI Cards Fund raise: ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ సంస్థ.. ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్‌లో బాండ్లు జారీ చేయటం ద్వారా 500 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసింది. 5 వేల ఫిక్స్డ్ రేట్, అన్సెక్యూర్డ్, ట్యాక్సబుల్ అండ్ రిడీమబుల్ బాండ్లను విడుదల చేశామని తెలిపింది. ఒక్కొక్కటి 10 లక్షల రూపాయల చొప్పున విలువ చేసే ఈ బాండ్లను నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు వెల్లడించింది. వీటి కాల వ్యవధి మూడేళ్లని, 2025 సెప్టెంబర్ 15న మెచ్యూర్ అవుతాయని వివరించింది.
Huge Orders to Hyderabad Company: హైదరాబాద్‌లోని MTAR Technologies కంపెనీకి 540 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఈ సంస్థ సివిలియన్ న్యూక్లియర్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, స్పేస్, బాల్ స్క్రూలు మరియు రోలర్ స్క్రూలు, మెరైన్ తదితర సెగ్మెంట్లతోపాటు పర్యావరణ అనుకూల ఇంధన విభాగంలో సేవలందిస్తోంది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద సంఖ్యలో కొత్త ఆర్డర్లు లభించటంతో రానున్న రోజుల్లో ఈ సెక్టార్లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది.
Why People Lose Money in Stock Markets?: జనం స్టాక్ మార్కెట్లలో డబ్బులను పోగొట్టుకుంటూ ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది.. అవగాహన లోపం. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అంటే అదీ ఒక సీరియస్ బిజినెస్ అనే చెప్పాలి. ఎవరైనా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ముందు దాని గురించి లోతుగా స్టడీ చేస్తారు. లాభనష్టాలను తెలుసుకుంటారు. అన్నింటిపైనా అవగాహన వచ్చాకే ఇన్వెస్ట్ చేస్తారు. దానిపైన లాభాలు వచ్చేవరకు ఓపిక పడతారు. కానీ స్టాక్ మార్కెట్లో అలా కాదు.
TCS Number One: ఐటీ సర్వీసుల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్).. ఇండియాలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. ఈ సంస్థ బ్రాండ్ వ్యాల్యూ రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగి 45 పాయింట్ 5 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ మేరకు కాంతర్ బ్రాన్జ్ ఇండియా ర్యాంకింగ్ సంస్థ ఒక జాబితాను రూపొందించింది. ఈ లిస్టులో టీసీఎస్.. హెచ్డీఎఫ్సీ బ్యాంకును మరియు ఇన్ఫోసిస్‌ను దాటి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. బ్రాండ్ వ్యాల్యూ 212 శాతం పెరగటంతో ఈ ఘనత సాధించింది.
Amazon Special delivery station in Andhra Pradesh: అమేజాన్ సంస్థ ఇండియాలోనే అతిపెద్ద ఆల్ ఉమెన్ డెలివరీ స్టేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ప్రారంభించింది. ఈ కంపెనీకి దేశం మొత్తమ్మీద ఏడు ఉమెన్ డెలివరీ కేంద్రాలు ఉండగా ఇది ఏపీలో రెండోది కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ సెంటర్లో 50 మంది మహిళలు పనిచేస్తారు. అమేజాన్ డెలివరీ సర్వీస్ పార్ట్నర్తో కలిసి ఈ స్టేషన్‌ను ఏర్పాటుచేసింది.
Qualities of a Good Incharge: మీరు పనిచేస్తున్న చోట మీకు సడన్‌గా ఇన్ఛార్జ్ పోస్ట్ ఆఫర్ వచ్చిందనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు?. సంస్థ నన్ను గుర్తించిందనుకొని సంతోషపడతారా? శాలరీ పెరుగుతుందని సంబరం చేసుకుంటారా? అధికారం చేతికొస్తుందని ఆనందం వ్యక్తం చేస్తారా? బాధ్యతలు పెరుగుతాయేమోనని బాధపడతారా?. అది మీ ఇష్టం. కానీ.. ఇవన్నీ తర్వాత. ముందు.. మీలో ఇన్ఛార్జ్ లక్షణాలున్నాయో లేదో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఇంతకీ అవేంటని ఆలోచిస్తున్నారా?.
Hyderabad Tops India: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. దేశంలోని టాప్-8 సిటీల్లో అగ్రస్థానంలో నిలిచింది. అది కూడా గ్రేడ్-ఎ కేటగిరీలో కావటం విశేషం. షామింగ్ మాల్స్‌లో లీజుకి ఇచ్చే విస్తీర్ణం(గ్రాస్ లీజబుల్ ఏరియా-జీఎల్ఏ)ను ప్రతిపదికగా తీసుకొని ఒక జాబితా రూపొందించారు. 5 లక్షలకు పైగా చదరపు అడుగుల జీఎల్ఏ కలిగిన షాపింగ్ మాల్స్, అవి ఉన్న నగరాలను గ్రేడ్-ఎలో చేర్చారు.
Rupee Strengthened: మన కరెన్సీ రూపాయి నిన్న ఒక్క రోజులోనే 38 పైసలు బలపడింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ సోమవారం 79. 53 వద్ద క్లోజ్ అవగా నిన్న మంగళవారం 79.15 వద్ద ముగిసింది. రూపాయి విలువ ఈ ఏడాది ఇప్పటివరకు 6.07 శాతం బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జులై 27 తర్వాత అంటే దాదాపు 50 రోజుల అనంతరం ఒకే రోజు ఇంత ఎక్కువ విలువ పెరగటం ఇదే తొలిసారి. చెప్పుకోదగ్గ విషయం కూడా.