Jolla Phone: ఫిన్లాండ్‌కు చెందిన టెక్నాలజీ సంస్థ జోల్లా (Jolla) సుదీర్ఘ విరామం అనంతరం మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫోన్‌కు జోల్లా ఫోన్ (Jolla Phone) అని నామకరణం చేశారు. దీనిని “స్వతంత్ర యూరోపియన్ డూ ఇట్ టుగెదర్ (DIT) లైనక్స్ ఫోన్” (Independent European Do It Together (DIT) Linux Phone)గా అభివర్ణిస్తున్నారు. ఇది 2013లో వచ్చిన ఒరిజినల్ మోడల్‌కు కొనసాగింపుగా రూపొందించబడింది. అలాగే మార్చగలిగే వెనుక కవర్ (Replaceable back cover) వంటి పాత ఫామ్ ఫ్యాక్టర్‌ను నిలుపుకుంది.
Thailand: థాయిలాండ్‌కు వెళ్తున్నారా.. ఇవి లేకపోతే నో ఎంట్రీ జాగ్రత్త!
ఈ ఫోన్ నార్డిక్ ప్రకృతి ప్రేరణతో స్నో వైట్, కామోస్ బ్లాక్, ది ఆరెంజ్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఈ మొబైల్ 6.36 అంగుళాల ఫుల్‌హెచ్‌డి AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గొరిల్లా గ్లాస్ రక్షణతో వస్తుంది. ముఖ్యంగా గోప్యతపై దృష్టి పెట్టి, ట్రాకింగ్ లేని Sailfish OS 5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది పనిచేస్తుంది. అదనపు భద్రత కోసం, మైక్రోఫోన్, కెమెరా, బ్లూటూత్ లేదా ఆండ్రాయిడ్ యాప్‌లను నిలిపివేయడానికి వీలుగా ఫిజికల్ ప్రైవసీ స్విచ్ అందించారు.
ఈ మొబైల్ లో 5,500 mAh సామర్థ్యం గల యూజర్ మార్చగలిగే బ్యాటరీ మరో ప్రధాన ఆకర్షణ. కెమెరా వివరాల్లోకి వస్తే.. వెనుక వైపు 50MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. అయితే ముందు వైపు కెమెరా రిజల్యూషన్‌ను ఇంకా వెల్లడించలేదు. ఈ ఫోన్ పేరు చెప్పని MediaTek 5G SoC అనే ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఇది 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. microSDXC ద్వారా స్టోరేజ్‌ను 2TB వరకు పెంచుకోవచ్చు. ఇది Jolla AppSupport ద్వారా ఆండ్రాయిడ్ యాప్‌లకు మద్దతు ఇస్తుంది. దీనిని అవసరమైతే నిలిపివేయవచ్చు.
Hydra: రూ.600 కోట్ల విలువైన 5 ఎకరాల ఆక్రమణల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
ఇక కనెక్టివిటీలో 5G, డ్యూయల్ నానో-సిమ్, WiFi 6, బ్లూటూత్ 5.4, NFC ఉన్నాయి. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, RGB నోటిఫికేషన్ LED వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ముందస్తు ఆర్డర్ కోసం €99 డౌన్ పేమెంట్‌తో అందుబాటులో ఉంది. ప్రీ-ఆర్డర్ ధర €499 (రూ.52,465)గా నిర్ణయించారు. దీని సాధారణ ధర €599 నుండి €699 మధ్య ఉండే అవకాశం ఉంది. జనవరి 4, 2026 నాటికి కనీసం 2,000 యూనిట్లకు మద్దతు లభిస్తేనే ఉత్పత్తి జరుగుతుందని కంపెనీ ప్రకటించింది. అయితే ఇప్పటికే లక్ష్యాన్ని మించి 2,515 యూనిట్లు ఆర్డర్ అయ్యాయి. డెలివరీలు 2026 మొదటి అర్ధభాగం చివరి నాటికి ప్రారంభమవుతాయని అంచనా.