Thailand: థాయిలాండ్‌కు వెళ్తున్నారా.. ఇవి లేకపోతే నో ఎంట్రీ జాగ్రత్త!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand: థాయిలాండ్‌కు వెళ్తున్న ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ దేశం మే 2025 నుంచి తన వీసా విధానాల్లో కీలక మార్పులు అమలు చేస్తుంది. దీంతో ఈ మార్పులు తెలియకుండా దేశంలోకి ప్రవేశిస్తున్న భారతీయులతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులందరిపై వాటి ప్రభావం పడుతోంది. దేశంలో వలస నియంత్రణలను కట్టుదిట్టం చేయడం, ప్రవేశ ప్రక్రియను క్లియర్‌గా అమలు చేయడమే థాయ్ ప్రభుత్వ ఈ మార్పులను అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల నేపథ్యంలో తాజాగా డాన్ ముయాంగ్ విమానాశ్రయంలో ఒక విదేశీ పర్యాటకురాలికి ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రవేశం నిరాకరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ ALSO: GCC Warns Iran: ముస్లిం దేశాన్ని హెచ్చరించిన 6 గల్ఫ్ దేశాలు..
Also Read
- CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
- Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
ఈ పర్యాటకురాలు ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన వీడియోలో “తగినంత నగదు లేదు” అనే కారణంతో తనను దేశంలోకి అనుమతించలేదని చెప్పింది. తాను థాయిలాండ్‌కు తరచూగా వెళ్తానని కానీ ఈసారి డాన్ ముయాంగ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తగినంత నగదు లేదు అనే నిబంధన కారణంగా తనను దేశంలోకి ఎంట్రీ ఇవ్వలేదని చెప్పింది. తాను ఇంతకు ముందెన్నో సార్లు థాయిలాండ్‌లోకి ప్రవేశించినప్పటికీ, ఈ నియమం గురించి తాను ఎప్పుడూ వినలేదని ఆమె స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఎంత డబ్బు అవసరమో ఎవరూ చెప్పలేదు. చెప్పి ఉంటే ఏటీఎం నుంచి వెంటనే తీసుకు వచ్చే దానిని” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరో విమానాశ్రయం ద్వారా తిరిగి ప్రయత్నించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులు సూచించారని చెప్పింది. కానీ అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఇతర పర్యాటకులు ఎవరూ కూడా డాన్ ముయాంగ్‌ను దేశంలోకి తమ ఎంట్రీ పాయింట్‌గా ఉపయోగించకుండా ఉండాలని హితవు పలికింది.
ఇంతకీ ఏంటీ ఈ కొత్త నియమం?
వాస్తవానికి ఈ నిబంధన కొత్తది కాదు. థాయిలాండ్ అధికారిక ప్రవేశ నియమాల ప్రకారం.. దేశంలోకి ప్రవేశించే విదేశీ పర్యాటకులు తగినంత ఆర్థిక స్తోమత ఉన్నట్లు రుజువు చూపించాలి.
ఒక వ్యక్తికి కనీసం 20,000 థాయ్ బాట్
కుటుంబానికి కనీసం 40,000 బాట్
పర్యాటక వీసా కోసం కూడా ఇదే ఆర్థిక రుజువు తప్పనిసరి చేశారు. వీసా మినహాయింపు రూల్ ద్వారా ప్రవేశించినా, ఇమ్మిగ్రేషన్ అధికారులు అడిగితే ఈ నిధుల రుజువు చూపించాలి. అవసరమైతే కాన్సులర్ అధికారులు అదనపు పత్రాలను కూడా కోరవచ్చు.
వీసా ఫీజు, గడువు వివరాలు
ప్రవేశ వీసా ఫీజు: 1,000 బాట్
వీసా చెల్లుబాటు: 60 రోజులు ఉండే అవకాశం
అవసరమైతే బ్యాంకాక్ ఇమ్మిగ్రేషన్ బ్యూరోలో పొడిగింపు అవకాశం
అదనంగా, కొన్ని దేశాల పౌరులు థాయిలాండ్‌కు బయలుదేరే ముందు తమ స్వదేశంలోని థాయ్ ఎంబసీ లేదా కాన్సులేట్‌లో వీసా కోసం తప్పనిసరిగా దరఖాస్తు చేయాలని థాయ్ MFA సూచిస్తోంది.
ప్రయాణికులకు ముఖ్య సూచనలు
థాయిలాండ్ చేరుకునే ముందు కనీసం 20,000 బాట్ నగదు లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ సిద్ధంగా ఉంచుకోవాలి.
డాక్యుమెంట్లలో లోపాలు ఉండకూడదు.
బయలుదేరే ముందు సమీపంలోని థాయ్ ఎంబసీ/కాన్సులేట్ వద్ద తాజా వీసా నియమాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
ఎయిర్‌పోర్ట్లలో ఇమ్మిగ్రేషన్ తనిఖీల సమయంలో అధికారుల నిర్ణయం ఫైనల్.
థాయిలాండ్‌లో అమల్లోకి వచ్చిన ఈ కొత్త వీసా, ఇమ్మిగ్రేషన్ నియమాలు ప్రపంచ పర్యాటకులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నియమాలను ముందుగానే తెలుసుకొని ప్రయాణిస్తే ఇలాంటి ఇబ్బందులను తప్పించుకోవచ్చని ట్రావెల్ నిపుణులు సూచిస్తున్నారు.
READ ALSO: ICC Fine: పాపం టీమిండియా.. మ్యాచ్ ఫీజులో షాక్ ఇచ్చిన ఐసీసీ
తాజావార్తలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
-
Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
-
Padi Kaushik Reddy : దానం అనర్హతపై సుప్రీం తీర్పు.. కౌశిక్ రెడ్డి హర్షం.!
-
Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
-
Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!