Amazon Special delivery station in Andhra Pradesh: అమేజాన్ సంస్థ ఇండియాలోనే అతిపెద్ద ఆల్ ఉమెన్ డెలివరీ స్టేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ప్రారంభించింది. ఈ కంపెనీకి దేశం మొత్తమ్మీద ఏడు ఉమెన్ డెలివరీ కేంద్రాలు ఉండగా ఇది ఏపీలో రెండోది కావటం చెప్పుకోదగ్గ విషయం. ఈ సెంటర్‌లో 50 మంది మహిళలు పనిచేస్తారు. అమేజాన్ డెలివరీ సర్వీస్ పార్ట్నర్‌తో కలిసి ఈ స్టేషన్‌ను ఏర్పాటుచేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌కు అమేజాన్ ఇలా ప్రత్యేక గుర్తింపు తీసుకురావటం (కిరీటం పెట్టడం) హర్షించదగ్గ పరిణామమనే టాక్ వినిపిస్తోంది.
ఎస్‌బీఐ.. బీపీఎల్‌ఆర్ పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్‌ని సున్నా పాయింట్ 7 శాతం పెంచింది. తద్వారా ఈ రేట్‌ని ఏడాదికి 13 పాయింట్ నాలుగు ఐదు శాతానికి చేర్చింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. దీనివల్ల BPLRతో లింకైన లోన్ రీపేమెంట్లు భారం కానున్నాయి. BPLRని చివరిసారిగా జూన్‌లో 12 పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచారు. ప్రస్తుతం ఇదే కొనసాగుతోంది. ఈ బ్యాంక్.. బేస్ రేట్ బేసిస్ పాయింట్లను కూడా ఇదే స్థాయిలో హైక్ చేసి 8 పాయింట్ 7 శాతానికి తీసుకెళ్లింది.
2 కోట్లకు డీల్‌షేర్ కస్టమర్లు
సోషల్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన డీల్‌షేర్ కస్టమర్ల సంఖ్య 2 కోట్లకు చేరింది. ఇందులో ఎక్కువ శాతం మంది ఇండియాలోని టయర్-2, టయర్-3 నగరాల్లో తొలిసారి ఇంటర్నెట్ వాడుతున్న వినియోగదారులేనని సంస్థ వెల్లడించింది. తాము దోస్త్ మోడల్ అనే ఎకోసిస్టమ్‌ని ఫాలో అవుతున్నామని తెలిపింది. సోషల్ నెట్‌వర్క్‌లను విస్తృతంగా వాడే కమ్యూనిటీ లీడర్లు మరియు స్థానికంగా ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాలపై మంచి పట్టున్నవాళ్లు ఈ బ్రాండ్ ప్రొడక్టులను ఆఫ్‌లైన్‌లో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారని పేర్కొంది. ఈ విధంగా 20 వేల మందికి పైగా ఉద్యోగాలు పొందారని ఓ ప్రకటనలో తెలిపింది.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఇండియా స్టాక్ మార్కెట్లు ఇవాళ మళ్లీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ మరోసారి 60 వేలకు పైనే ట్రేడ్ అవుతుండటం విశేషం. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 18 వేలు దాటింది. బ్యాంక్ ఇండెక్స్ రికార్డ్ స్థాయికి చేరింది. ఎస్‌బీఐ, పీవీఆర్, టీఎంబీ, సీఈ ఇన్ఫో షేర్లు ఆశాజనకంగా ఉన్నాయి. వాటిలో ఈరోజు పెట్టుబడి పెట్టే అవకాశాలను పరిశీలించొచ్చు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.27 వద్ద కొనసాగుతోంది.