Why People Lose Money in Stock Markets?: జనం స్టాక్ మార్కెట్లలో డబ్బులను పోగొట్టుకుంటూ ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది.. అవగాహన లోపం. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం అంటే అదీ ఒక సీరియస్ బిజినెసే అనుకోవాలి. ఎవరైనా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ముందు దాని గురించి లోతుగా స్టడీ చేస్తారు. లాభనష్టాలను తెలుసుకుంటారు. అన్నింటిపైనా అవగాహన వచ్చాకే ఇన్వెస్ట్ చేస్తారు. దానిపైన లాభాలు వచ్చేవరకు ఓపిక పడతారు. కానీ స్టాక్ మార్కెట్‌లో అలా కాదు. ఇవాళ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి, రేపు డబ్బులు వేసి, ఎల్లుండి నుంచి ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటారు. అది తప్పు. అందుకే మనీ లాస్ అవుతున్నారు.
స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన నాలెడ్జ్ లేకపోవటం, స్కిల్స్ లోపించటం వల్ల కూడా ప్రజలు నష్టాల బారిన పడుతున్నారు. ఏదైనా బిజినెస్ చేయాలంటే అవగాహన తర్వాత అనుభవం సాధించాలి. మెలకువలు నేర్చుకోవాలి. గురువులేని విద్య గుడ్డి విద్య అంటారు కదా. అలాగే ఏ పనైనా బేసిక్స్ తెలియకుండా చేస్తే పునాదిలేని ఇల్లు మాదిరిగా కుప్పకూలిపోతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్‌ని ‘హ్యాండిల్ విత్ కేర్’ అని నిపుణులు చెబుతున్నారు. ఇంకో ముఖ్య విషయం.. డిసిప్లెయిన్ అండ్ సైకాలజీ. వ్యాపారం గురించి అవగాహన, బిజినెస్ చేసిన అనుభవం ఉన్నవాళ్లకు క్రమశిక్షణ, ట్రేడింగ్ సైకాలజీ సైతం ఇంపార్టెంటే.
ఉదాహరణకు.. మనం ఏదైనా షోరూం బిజినెస్ చేస్తున్నామనుకోండి. నా ఇష్టం వచ్చినప్పుడు షోరూం ఓపెన్ చేస్తాను, మిగతా సమయంలో ఇంట్లో ముసుగుపెట్టుకొని పడుకుంటానంటే కుదరదు. టైమింగ్స్ మెయిన్టెయిన్ చేయాలి. స్టాక్ మార్కెట్ వ్యాపారం చేసేవాళ్లయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కంపెనీల, షేర్ల పెర్ఫార్మెన్స్‌ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. ఇలాంటి మరిన్ని విలువైన విషయాలను తెలుసుకోవాలంటే ఎన్-బిజినెస్ అందిస్తున్న ఫిన్‌టాక్ వీడియో చూస్తే సరిపోతుంది. వెల్త్ ట్రీ గ్రూపు ఫౌండర్, సీఈఓ ప్రసాద్ దాసరి ఎన్నో కీలకాంశాలను వెల్లడించారు. ఈ ఐటమ్ కిందే ఆ వీడియో క్లిప్పింగ్ ఉంది. పరిశీలించగలరు.