Self-Employment: ఏ బిజినెస్‌ను ప్రారంభించినా ఎంతో కొంత మందికి ఎంప్లాయ్మెంట్ అందుబాటులోకి వస్తుంది. కానీ.. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌ని క్రియేట్ చేయాలనేదే తన లక్ష్యమని డిజిటల్ మార్కెటర్ వీరేందర్ చౌదరి అన్నారు. ఈయన ఫేస్బుక్ యాడ్స్ ఎక్స్‌పర్ట్‌గా, సేల్స్ ట్రైనర్‌గా రాణిస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్‌లో ఏడేళ్ల అనుభవం కలిగిన ఈయన వేలాది మందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు తమదైన కెరీర్‌ని సొంతం చేశారు. డిజిటల్ మార్కెటింగ్‌లోని అఫిలియేట్ మార్కెటింగ్ అనే ఒక మాడ్యూల్ గురించి వివరించారు.
Business and Finance Carrier: ఫైనాన్స్ రంగంలో ఉద్యోగావకాశాల కోసం కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? స్టూడెంట్స్‌కి ఎలాంటి నాలెడ్జ్ అవసరం? అనే విషయాలను ‘ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్’ ఎండీ ప్రవీణ్ కుమార్ ‘ఎన్-కెరీర్’కి వివరించారు. క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్‌కి(బుక్స్‌కి), ఫీల్డ్ ఎడ్యుకేషన్(కంపెనీల్లో వర్క్ ఎక్స్‌పీరియెన్స్)కి మధ్య తేడాను చక్కగా విశ్లేషించారు. ‘‘కాలేజీల్లో పాఠాలు చెప్పేవారు చాలా వరకు కార్పొరేట్స్లో పనిచేయకపోవటం వల్ల అక్కడ ఏం స్కిల్స్ అవసరం అనేది వాళ్లు గెస్ చేయలేకపోతున్నారు.
Global Telugu Teacher: తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన కృష్ణప్రసాద్ గవర్నమెంట్ టీచర్. హెడ్మాస్టర్ కూడా. తెలుగు పైన ఆయనకు మమకారం ఎక్కువ. విద్యార్థుల్లో ఈ భాష మీద ఆసక్తి పెంచేందుకు కృష్ణప్రసాద్ చేస్తున్న ప్రయత్నాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు. చదువంటే ఇంగ్లిష్ పాఠాలే అన్నట్లుగా మారిన ఈ రోజుల్లో పిల్లల్లోని, తల్లిదండ్రుల్లోని ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. పాఠాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు.
Seven Metal Companies into TATA Steel: టాటా గ్రూప్‌కి చెందిన ఏడు మెటల్ కంపెనీలు టాటా స్టీల్‌లో విలీనమయ్యాయి. ఈ విలీనానికి టాటా స్టీల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి సమర్పించిన వివరాల ప్రకారం.. టాటా స్టీల్‌లో విలీనమైన ఆ మెటల్ కంపెనీల పేర్లు.. టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ది టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, టాటా మెటాలిక్స్ లిమిటెడ్, TRF లిమిటెడ్, ది ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్,…
Funds for Bhanzu: హైదరాబాద్‌కి చెందిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ భాన్జుకి 115 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ప్రపంచంలోనే ఫాస్ట్‌గా లెక్కలు చేసే హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ భాను ఈ సంస్థను తన పేరిటే భాన్జుగా ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలను మరియు మ్యాథ్స్ కరికులమ్లను ఇంకా డెవలప్ చేసేందుకు ఈ ఫండ్స్‌ను వినియోగిస్తామని సంస్థ సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న నీలకంఠ భాను తెలిపారు.
WE HUB: ‘వి హబ్’ అనేది టెక్నికల్‌గా ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ హబ్ కావొచ్చు. కానీ ఈ సంస్థ అందిస్తున్న అసమాన సేవలను బట్టి దాన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ హబ్ అని కూడా అనొచ్చు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా మహిళల సాధికారత కోసం ‘వి హబ్’ తన వంతుగా శాయశక్తులా పాటుపడుతోంది. వ్యాపారానికి ముఖ్యంగా డబ్బు కావాలి. కానీ అంతకన్నా ముందు అసలు బిజినెస్ చేయాలనే ఆలోచన, ప్రణాళిక ఉండాలి. అవి ఉంటే పెట్టుబడి దానంతట అదే వస్తుందని ‘వి హబ్’ సీఈఓ దీప్తి రావుల అన్నారు.
Stock Market Fundamentals: స్టాక్ మార్కెట్లలో డబ్బును పోగొట్టుకోకుండా ఉండాలంటే ముఖ్యంగా రెండు సబ్జెక్టులను స్టడీ చేయాలి. 1. ఫండమెంటల్ అనాలసిస్. 2. టెక్నికల్ అనాలసిస్. ఫండమెంటల్ అనాలసిస్‌లో ఈఐసీ అప్రోచ్ ప్రధానమైంది. ఈ అంటే ఎకానమిక్, ఐ అంటే ఇండస్ట్రీ, సీ అంటే కంపెనీ. ఎకానమీ విషయానికి వస్తే ప్రతి దేశాన్ని ఒక ఎకానమీగా భావించాలి. అయితే.. ముందుగా ఆ ఎకానమీ గ్రోయింగ్/రిసెషన్/సంప్/రికవరీ ఎకానమీల్లో దేని కిందికి వస్తుందో చూడాలి.
AP, Telangana: ఇంటర్నేషనల్ మార్కెట్లలో వైద్య పరికరాల ఎగుమతుల ప్రోత్సాహకానికి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ని ఏర్పాటుచేసినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫార్మాస్యుటికల్స్ డిపార్ట్మెంట్లో భాగంగా పనిచేసే ఈ కౌన్సిల్ హెడ్‌క్వార్టర్స్ నోయిడాలో ఉంటుందని, బ్రాంచ్ ఆఫీసులు ఏపీ, తెలంగాణల్లో ఉంటాయని పేర్కొంది. మన దేశం గత ఆర్థిక సంవత్సరంలో 23 వేల 766 కోట్ల రూపాయల విలువైన మెడికల్ డివైజ్‌లను ఎగుమతి చేసింది.
Top-5 Automobile Companies in the World: ప్రపంచంలోని కొన్ని ఆటోమొబైల్ కంపెనీల పేర్లు చెప్పమంటే చెబుతాం గానీ టాప్-5 సంస్థల పేర్లు అడిగితే చెప్పగలమా?. చాలా మందికి కష్టమే. ఎందుకంటే ఇలాంటి స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్(జీకే)ని ప్రత్యేకంగా చదివి గుర్తుపెట్టుకుంటే తప్ప ఆన్సర్ చేయలేం. అది కూడా ఒక క్రమపద్ధతిలో కంపేర్ చేసుకుంటూ స్టడీ చేయాలి (లేదా) స్లైడ్స్ రూపంలోని ప్రజెంటేషన్‌ను చూసినా గుర్తుండిపోతుంది. ‘ఎన్-బిజినెస్’ ఆ ప్రయత్నమే చేసింది.
E-Pathshala For All: ‘ఇ-పాఠశాల’ను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) ప్రవేశపెట్టింది. ఇది అందరి వేదిక. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, టీచర్ ఎడ్యుకేటర్స్, పాలసీ ప్లానర్స్, సామాన్యులు, ప్లేయర్స్.. ఇలా ప్రతిఒక్కరికీ అవసరమైన డిజిటల్, డిజిటైజబుల్ వనరులు ఈ ప్లాట్‌ఫాంలో దొరుకుతాయి. ఇక్కడ నాణ్యమైన విద్య లభిస్తోంది.