Cent Percent Work From Home: స్పెషల్ ఎకనమిక్ జోన్ యూనిట్లలో 100 శాతం ‘వర్క్ ఫ్రం హోం’ కావాలంటున్న ఇండస్ట్రీ డిమాండ్‌ను పరిశీలిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిపాదన వల్ల చిన్న సిటీల్లో ఉద్యోగావకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు వీలుపడుతుందని, సర్వీసుల ఎగుమతులు పెరుగుతాయని కూడా అంచనా వేస్తున్నట్లు తెలిపింది.
Special Story On Cyrus Mistry: సైరస్ మిస్త్రీ భారతీయ వ్యాపారవేత్తల్లో ఒక ప్రముఖుడు. ఆయన ప్రతిష్టాత్మక టాటా సంస్థకు 6వ చైర్మన్‌గా వ్యవహరించారు. ముక్కుసూటి మనిషి. నిజాయితీకి, నిరాడంబరత్వానికి నిదర్శనంగా ఉండేవారు. టాటా గ్రూపు నుంచి వైదొలిగాక ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. కొవిడ్ సమయంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నారు. ఆయన పెట్టుబడులు ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లోనే ఉండటం వల్ల మరియు షేర్ హోల్డింగులు టాటా గ్రూపు ఆధీనంలోనే
Mahabharatam Theme in Office: తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. ఎందుకంటే.. అదొక మహాకావ్యం. భారత ఇతిహాసం. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. పర్వం అంటే చెరుకు కణుపు. అందుకే ఈ పంచమ వేదాన్ని పంచదార తీపితో పోల్చారు. చెరుకు గడను నమిలేకొద్దీ రసం నోటిలోకి వచ్చి నోరు తీపవుతుంది. అలాగే భారతాన్ని చదివేకొద్దీ జ్ఞానం పెరుగుతుందని చెబుతారు. అనేక క్యారెక్టర్లు కలిగిన ఈ అద్భుత రచన అన్ని వర్గాలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది.
Prepaid Card for Kamineni: కామినేని ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ కోసం ప్రీపెయిడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ కార్డును అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఆఫర్డ్ ప్లాన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్డును ఉపయోగిస్తే క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. మందుల పైన, మెడికల్ టెస్టుల పైన డిస్కౌంట్ ఇస్తారు. 10 వేల రూపాయలు మొదలుకొని 10 లక్షల రూపాయల వరకు మెడికల్ లోన్ కూడా అందిస్తారు.
Shock News to Samsung: శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహక పథకం కింద ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలను నిలిపేసింది. ఆ కంపెనీ జనరేట్ చేసిన ఇన్వాయిస్లలో కొన్ని లోటుపాట్లు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇంక్రిమెంటల్ ప్రొడక్షన్ మరియు సేల్స్‌కి సంబంధించి శామ్సంగ్ ఇచ్చిన డేటాకి, కేంద్ర ప్రభుత్వం సేకరించిన సమాచారానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది.
Bahubali Producer Shobu Yarlagadda Special Interview Promo: రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా వెండి తెర మీద ఎన్ని అద్భుతాలను సృష్టించిందో మనం అందరం చూశాం. అందుకే ఆ మూవీ విశేషాలు ఇప్పటికీ ఎప్పటికీ ఆసక్తికరమే. ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు మనకు తెలియని ఎన్నో ముఖ్య విషయాలను ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ తాజాగా ‘ఎన్-బిజినెస్ ఐకాన్స్’కి వెల్లడించారు.
Top Five Insurance Companies in India: జీవితానికే కాదు. వాహనాలకు, సంస్థలకు, వ్యాపారాలకు, ఆరోగ్యానికి, పంటలకు ఇలా.. ప్రతి కేటగిరీలోనూ ఇన్సూరెన్స్ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే మన దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో చాలా బీమా సంస్థలు ఉన్నాయి. అయితే జనం ఎక్కువ శాతం ప్రభుత్వ బీమా సంస్థల వైపే మొగ్గుచూపుతుండటం చెప్పుకోదగ్గ విషయం. ఇండియాలోని టాప్ ఫైవ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో మూడు సంస్థలు సర్కారుకు సంబంధించినవే కావటం దీనికి నిదర్శనం.
Akasa Air Pilot’s Salaries: మన దేశ విమానయాన రంగంలోకి కొత్తగా ప్రవేశించిన ఆకాశ ఎయిర్ సంస్థ.. పైలట్ల శాలరీలను భారీగా పెంచటంలో ముందంజలో నిలుస్తోంది. తాజాగా సగటున 60 శాతం హైక్ చేసింది. వైమానిక సేవలను మరింతగా విస్తరించాలనే లక్ష్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 2 లక్షల 79 వేలు మాత్రమే ఉన్న కెప్టెన్ల స్టార్టింగ్ శాలరీ నాలుగున్నర లక్షలకు చేరింది. ఫస్ట్ ఆఫీసర్ల వేతనం లక్షా 11 వేల నుంచి లక్షా 80 వేలకు పెరిగింది.
Kakatiya Mega Textile Park: కాకతీయ వీవర్స్ కోపరేటివ్ సొసైటీ ఆరేళ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో చీరల తయారీ ప్రారంభమైంది. ఈ పార్క్‌ను చేనేత మరియు జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించాల్సి ఉంది. హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలోని ఔటర్ రింగ్ రోడ్డులో ఈ పార్క్‌ను 60 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అక్కడ 364కి పైగా పవర్ లూమ్ యూనిట్లు ఉన్నాయి.
YouTube Player For Education: ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ యూట్యూబ్‌ను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు అందరూ ఆ వీడియోలను వీక్షిస్తూ టైంపాస్ చేయటమే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా పొందుతున్నారు. మనకు నచ్చిన విషయం (టాపిక్) ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలన్నా, దానిపై తేలిగ్గా, తొందరగా అవగాహన పెంచుకోవాలన్నా ఇప్పుడు ఇదో చక్కని మార్గంగా మారింది. దీంతో ఈ ప్లాట్‌ఫామ్‌పై ఎడ్యుకేషనల్ కంటెంట్‌ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా, ఇంటరాక్టివ్‌గా అందించటం కోసం యూట్యూబ్ పనిచేస్తోంది.