Huge Orders to Hyderabad Company: హైదరాబాద్‌లోని MTAR Technologies కంపెనీకి 540 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఈ సంస్థ సివిలియన్ న్యూక్లియర్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, స్పేస్, బాల్ స్క్రూలు మరియు రోలర్ స్క్రూలు, మెరైన్ తదితర సెగ్మెంట్లతోపాటు పర్యావరణ అనుకూల ఇంధన విభాగంలో సేవలందిస్తోంది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద సంఖ్యలో కొత్త ఆర్డర్లు లభించటంతో రానున్న రోజుల్లో ఈ సెక్టార్‌లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది. ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారిస్తామని మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
‘మునోత్’ చర్చలు
మొబైల్ పరికరాల్లో లిథియం అయాన్ సెల్స్ టెస్టింగ్ కోసం మునోత్ ఇండస్ట్రీస్.. రిలయెన్స్ జియోతో ప్రాథమిక చర్చలు జరుపుతోంది. చెన్నైకి చెందిన ఈ సంస్థ ఇండియాలోనే తొలిసారిగా లిథియం అయాన్ సెల్స్ తయారు చేసిన ఘనత సాధించింది. పవర్ బ్యాంక్ బ్యాటరీ మార్కెట్‌లో 60 శాతం వాటాను సొంతం చేసుకోవాలని ఆశిస్తోంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ మరియు పవర్ బ్యాంకుల్లో వినియోగానికి దిగుమతి చేసుకుంటున్న లిథియం అయాన్ సెల్స్ మార్కెట్ విలువ 15 వేల కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని మునోత్ ఇండస్ట్రీస్ పేర్కొంటోంది.
GHMC Commissioner Lokesh Kumar : GHMC కమిషనర్ లోకేష్ కుమార్ ఎక్కడ ?
10 ట్రిలియన్ డాలర్లకు
2030 నాటికి ఇండియా ఎకానమీ 10 ట్రిలియన్ డాలర్ల స్థాయికి ఎదగనుందని పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి అన్నారు. 2047 నాటికి మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భవించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ హైటెక్నాలజీ మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ముంబైలో నిన్న నిర్వహించిన 25వ ఎనర్జీ టెక్నాలజీ మీట్‌లో ఆయన ఈ మేరకు పేర్కొన్నారు.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
ఇండియా స్టాక్ మార్కెట్లు ఈ వారాంతాన్ని నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్ 436 పాయింట్లు కోల్పోయి 59497 వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిఫ్టీ 94 పాయింట్లు నష్టపోయి 17783 వద్ద కొనసాగుతోంది. మహింద్రా అండ్ మహింద్రా స్టాక్స్ వ్యాల్యూ 2 శాతం పతనమైంది. ఇవాళ అదానీ, టాటా, యూపీఎల్, ఎస్‌బీఐ, పతంజలి షేర్లు ఆశాజనకంగా ఉన్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.40 వద్ద ఉన్న ఉంది.