Record Level Sales in Festive Season: మన దేశంలో పండగ సీజన్ ప్రారంభం కావటంతో స్మార్ట్ఫోన్ల అమ్మకాల విలువ రికార్డ్ స్థాయిలో 61 వేల కోట్ల రూపాయలు దాటనున్నట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. సేల్ అయ్యే ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒకటి 5జీ ఎనేబుల్డ్ ఫోన్ కానుందని పేర్కొంది. ఈ మొత్తం విక్రయాల్లో 61 శాతం ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే జరగనున్నాయని తెలిపింది. ఒక స్మార్ట్‌ఫోన్ యావరేజ్ సెల్లింగ్ ప్రైస్ 12 శాతం పెరిగి అత్యధిక రేటైన 242 డాలర్లకు…
Early Diwali to India: మన దేశానికి ఈ ఏడాది దీపావళి పండుగ ముందే రానుందని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు. భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఇరు దేశాలకూ ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మరీ ముఖ్యంగా ఇండియాకి లెదర్, టెక్స్టైల్, జ్యులరీ, ప్రాసెస్డ్ ఆగ్రో ప్రొడక్ట్స్ వంటి రంగాల్లో ఎగుమతులు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Stock Market Analysis: గత రెండు వారాలుగా ఇండియన్ స్టాక్ మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తున్నాయి. దీంతో ‘ఈ వారం ఏయే కంపెనీల షేర్లను కొనుగోలు చేస్తే ఇన్వెస్టర్లకు లాభాలు వస్తాయి’ అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ‘వెల్త్ ట్రీ గ్రూప్’ ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి చక్కని విశ్లేషణ చేశారు. ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఏ మేరకు పెంచనుంది? ఆ ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై ఏవిధంగా ఉండనుంది అనే కీలక అంశాలను అందరికీ అర్థమయ్యేలా వివరించారు.
Telangana Company: హైదరాబాద్‌లోని ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్కి మహారాష్ట్ర నుంచి 185 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ వచ్చింది. 123 బస్సుల మ్యానిఫ్యాక్షరింగ్, మెయింటనెన్స్ బాధ్యతలను థానే మునిసిపల్ ట్రాన్స్పోర్ట్ అప్పగించింది. ఈ బస్సులను 9 నెలల్లో తయారుచేసి అందించాలని, 15 ఏళ్లపాటు నిర్వహణ చూసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నారు.
RBI Orders: 10 వేల కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు కలిగిన అర్బన్ కోపరేటివ్ బ్యాంకులు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నాటికి చీఫ్ కాంప్లియెన్స్ ఆఫీసర్లను నియమించాలని రిజర్వ్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. టయర్-4 ఎంటిటీస్‌గా వర్గీకరించిన ఈ బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని సూచించింది.
Online Courses: తమ కాళ్లపై తాము నిలబడాలనుకునే మహిళలకు హునార్ ఆన్లైన్ కోర్సెస్ బాసటగా నిలుస్తోంది. 30కి పైగా క్రియేటివ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ 15 వేల మందికి పైగా మహిళలు శిక్షణ పొందారు. అందులో 2 వేల మందికి పైగా బిజినెస్‌లను ప్రారంభించారు. ఈ కోర్సులు ముఖ్యంగా యాప్ బేస్డ్. అందుకే 20 లక్షలకుపైగా యాప్ డౌన్లోడ్స్ నమోదయ్యాయి.
Talibans to ban TikTok, Pubg: ఆఫ్ఘనిస్థాన్‌లో ఇప్పటికే 2 కోట్ల 34 లక్షల వెబ్సైట్లను బ్లాక్ చేసిన తాలిబన్ ప్రభుత్వం మరో నెల రోజుల్లో టిక్‌టాక్‌ను, మూడు నెలల్లో పబ్జీ యాప్‌ని సైతం బ్యాన్ చేయనున్నట్లు ప్రకటించింది. దేశ అధికార పగ్గాలను తాలిబన్లు చేజిక్కించుకున్న ఈ ఏడాది కాలంలో అనైతిక కంటెంట్‌ను ప్రచురించాయనే ఆరోపణలతో ఈ నిషేధం విధించింది. అయినప్పటికీ ఆయా వెబ్సైట్లు కొత్త పేజీలతో పుట్టుకొస్తున్నాయని అసహనం ప్రదర్శించింది.
Key Treatment For Knee Problems: ముసలితనంలో వచ్చే కీళ్ల వ్యాధికి కీలకమైన చికిత్స అందుబాటులోకి వస్తోంది. దేశంలోనే తొలిసారిగా ‘ఆఫ్ ది సెల్ఫ్’ సెల్ థెరపీ ట్రీట్మెంట్కు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పేషెంట్‌కి ఇచ్చే ఒక్క ఇన్జెక్షన్ ఖరీదే లక్షా పాతిక వేల రూపాయలు కావటం గమనించాల్సిన విషయం. ఈ మెడిసిన్ ప్రభావం రెండేళ్ల కన్నా ఎక్కువే ఉంటుంది.
Shweta Tiwari: బాలీవుడ్‌లోని అందమైన భామల్లో శ్వేతా తివారీ ఒకరు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘‘నాకు పెళ్లి మీద ఏమాత్రం నమ్మకంలేదు. మ్యారేజ్ చేసుకో అని నా కూతురిని కూడా బలవంతపెట్టను. ఆ విషయంలో తుది నిర్ణయం నా కూతురిదే. ఆమెకు ఏది సంతోషంగా అనిపిస్తే అదే చేయమని చెబుతా. ఎవరి కోసమో మన జీవితాన్ని త్యాగం చేయాల్సిన పనిలేదనే విషయాన్ని నా కూతురికి తేల్చిచెప్పాను.
Chinese Loan Apps: హైదరాబాద్ సహా దేశంలోని 16 చోట్ల చైనా లోన్ యాప్‌లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిపింది. బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ, పుణె, గురుగ్రామ్ తదితర నగరాల్లో నిర్వహించిన సోదాల్లో 46 కోట్ల రూపాయలను సీజ్ చేసింది. హెచ్పీజెడ్ టోకెన్ యాప్‌లో డబ్బు పెట్టుబడి పెట్టి బిట్‌కాయిన్‌తోపాటు ఇతర క్రిప్టోకరెన్సీని కొనుగోలు చేస్తే రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ కేటుగాళ్లు అమాయకులను మోసగిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో రైడ్స్ చేశామని ఈడీ అధికారులు తెలిపారు.