SBI Cards Fund raise: ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ సంస్థ.. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ బేసిస్‌లో బాండ్లు జారీ చేయటం ద్వారా 500 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసింది. 5 వేల ఫిక్స్‌డ్ రేట్, అన్‌సెక్యూర్డ్, ట్యాక్సబుల్ అండ్ రిడీమబుల్ బాండ్లను విడుదల చేశామని తెలిపింది. ఒక్కొక్కటి 10 లక్షల రూపాయల చొప్పున విలువ చేసే ఈ బాండ్లను నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు వెల్లడించింది. వీటి కాల వ్యవధి మూడేళ్లని, 2025 సెప్టెంబర్ 15న మెచ్యూర్ అవుతాయని వివరించింది.
రష్యాను దాటేసిన సౌదీ
మన దేశానికి 2వ అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా సౌదీ అరేబియా నిలిచింది. ఆగస్టు నెలలో రష్యాను దాటేసి తిరిగి తన ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. కాకపోతే ఈ రెండు దేశాల మధ్య మార్జిన్ మరీ ఎక్కువగా లేకపోవటం గమనించాల్సిన విషయం. మూడు నెలల కిందట ఈ స్థానం సౌదీ అరేబియాకే సొంతం కాగా మధ్యలో రష్యా ఆక్రమించింది. ఇండియాకి అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఎప్పట్లాగే ఇరాక్ అగ్ర భాగంలో కొనసాగుతోంది. ఈ వివరాలను ఇండస్ట్రీ మరియు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మన దేశం రోజుకి 8 లక్షల 63 వేల 950 బ్యారెళ్ల ముడి చమురుని సౌదీ అరేబియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది. ఇది జులై నెలతో పోల్చితే 4.8 శాతం ఎక్కువ. రష్యా నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ 2.4 శాతం తగ్గి 8 లక్షల 55 వేల 950 బీపీడీ(బ్యారెల్స్ పర్ డే)లకి దిగొచ్చింది. అంటే ఈ రెండు దేశాల మధ్య మార్జిన్ తేడా 2.4 శాతం మాత్రమే.
Huge Orders to Hyderabad Company: హైదరాబాద్ సంస్థకు భారీ ఆర్డర్లు
జియోకి పెరిగిన యూజర్లు 29.4 లక్షలు
దేశంలోని అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన రిలయెన్స్ జియోకి జులై నెలలో 29 లక్షలకుపైగా యూజర్లు పెరిగారు. ఈ తాజా వివరాలను టెలికం సెక్టార్ రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసింది. ఎయిర్‌టెల్‌కి 5 లక్షలకు పైగా సబ్‌స్క్రయిబర్లు చేరారు. ఇదిలాఉండగా వొడాఫోన్-ఐడియా దాదాపు పన్నెండున్నర లక్షల వైర్‌లెస్ కస్టమర్లను కోల్పోయింది. ఈ ఏడాది జులై చివరి నాటికి ఇండియా మొత్తమ్మీద ఉన్న వైర్‌లెస్ యూజర్ల సంఖ్య 114 కోట్లకు పైగానే నమోదవటం విశేషం.