Stock Market Analysis: ఇవాళ శనివారం, రేపు ఆదివారం స్టాక్ మార్కెట్లకు సెలవనే సంగతి అందరికీ తెలిసిందే. అందువల్ల ఈ వారంలోని మిగతా ఐదు రోజులు (సోమవారం నుంచి శుక్రవారం వరకు) గ్లోబల్ స్టాక్ మార్కెట్లు ఎలాంటి పనితీరును కనబరిచాయో తెలుసుకోవటం ఆసక్తికరమైన అంశం. అందులోనూ.. స్టాక్ మార్కెట్‌పై పట్టున్న వ్యక్తులు ఆ అనాలసిస్ చేస్తే ఇంకా బాగుంటుంది. వెల్త్ ట్రీ గ్రూపు ఫౌండర్ అండ్ సీఈఓ ప్రసాద్ దాసరి ఇలాంటి నిపుణుల కోవలోకే వస్తారు.
Special Story on Startups in India: ఏదైనా ఒక కొత్త ఉత్పత్తిని లేదా సర్వీసును ప్రారంభించాలనుకునే ముందు దానికి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉందో చూసి నిర్ణయం తీసుకుంటారు. స్టార్టప్ అనేది ఎప్పుడూ అధిక వ్యయం, అల్ప ఆదాయంతో మొదలవుతుంది. అందువల్ల దీనికి ఫండింగ్ అవసరం. స్టార్టప్ ఎదుగుతున్న క్రమంలో ఒక మిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ వ్యాల్యుయేషన్ పొందినప్పుడు దాన్ని మినీకార్న్ అంటారు. యూనికార్న్ అయ్యే ముందు సూనికార్న్గా పేర్కొంటారు.
Ravi Narain-Bhagavad Gita: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ, మాజీ ఎండీ రవి నరైన్తోపాటు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ కోర్టులో ఛార్జ్షీట్లు దాఖలుచేసింది. అనంతరం ఈ ముగ్గురి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 21వ తేదీకి పొడిగించింది. ఇదిలా ఉండగా తనకు భగద్గీతతోపాటు మరో పుస్తకాన్ని, కళ్లజోడును అందించాలని రవి నరైన్ న్యాయస్థానానికి విజ్జప్తి చేశారు.
Telangana-Amazon Tieup: అమేజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. మరింత ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా పౌర సేవల రంగంలో సమూల మార్పులు తేనుంది. కంప్యూటింగ్, స్టోరేజ్, మేనేజ్మెంట్, గవర్నెన్స్ క్యాపబిలిటీస్లో అమేజాన్ వెబ్ సర్వీసెస్ సొల్యూషన్స్‌ను వినియోగించనున్నారు.
New Director to NIMS: నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)కి కొత్త డైరెక్టర్ రానున్నారు. ప్రస్తుత డైరెక్టర్ డాక్టర్ మనోహర్.. గుండె పోటుతో నాలుగు రోజుల కిందట హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకి ఆ ఆస్పత్రిలోనే సర్జరీ చేయనుండటం, దీనివల్ల దీర్ఘకాలం ట్రీట్మెంట్ పొందాల్సి ఉండటంతో నిమ్స్‌కి కొత్త డైరెక్టర్ని నియమించకతప్పని పరిస్థితి నెలకొంది.
Hyderabad Hosting Restaurant Conclave: హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కాబోతోంది. 13వ తేదీన ‘ది ఇండియన్ రెస్టారెంట్ కాన్క్లేవ్’కి ఆతిథ్యమివ్వబోతోంది. రెస్టారెంట్ల రంగానికి సంబంధించి ఇదే అతిపెద్ద సమావేశం కానుండటం విశేషం. హైటెక్స్‌లోని హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటుచేసిన ఈ మీటింగ్‌ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. ‘ది నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
IKEA India New Idea: ఐకియా ఇండియా సరికొత్త ఐడియాను అమలుచేస్తోంది. ‘‘ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్లండి’’ అంటూ వినూత్న ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా మా స్టోర్‌కి రండి అని సాదరంగా ఆహ్వానిస్తోంది. రెడీమేడ్ ఫర్నీచర్‌ను విక్రయించే ఈ సంస్థ ‘ఘర్ ఆ జావో’ పేరుతో కొత్త బ్రాండ్ పొజిషనింగ్‌ని ప్రారంభించినట్లు వెల్లడించింది. వినియోగదారులతో భావోద్వేగపూరితమైన మరియు హేతుబద్ధమైన అనుబంధాన్ని ఏర్పరచుకునేందుకు ఈ క్యాంపెయిన్ని వివిధ ప్రచార మాధ్యమాల్లో
Special Story on Vinayaka Nimajjanam: మన దేశంలో ఇన్ని రోజులు ఇంత మంది జనం కలిసిమెలిసి చేసుకునే పండుగ వినాయకచవితి తప్ప మరొకటి లేదేమో. గణేషుడి పుట్టిన రోజున ఘనంగా మొదలయ్యే ఈ నవరాత్రి ఉత్సవాలు నిరాటంకంగా భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య సాగాయి. బొజ్జగణపయ్య బొమ్మలను పూజల కోసం కొలువు దీర్చిన పవిత్రమైన క్షణం నుంచి గంగమ్మ ఒడిలోకి చేర్చే గడియ వరకు ప్రతి రోజూ ప్రతిఒక్కరూ ఈ వేడుకల్లో ఆద్యంతం పాల్గొన్నారు.
Smart Fitness Mirror: ఫిట్నెస్ ప్రేమికులకు శుభవార్త. పోర్టల్ (PORTL) అనే సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో పనిచేసే మోడ్రన్, స్మార్ట్ ఫిట్నెస్ మిర్రర్ని రూపొందించింది. ఇది మన వర్కౌట్లకు రియల్ టైమ్ ఫామ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. హెల్త్ ట్రాకింగ్, మోనిటరింగ్ కూడా చేస్తుంది. ఇందులోని పాకెట్ సైజ్‌లో ఉండే బయో సెన్స్ డివైజ్ మన ఈసీజీ, బ్లడ్ షుగర్, టెంపరేచర్, బ్లడ్ ప్రెజర్ తదితర కీలక సమాచారా ఒక్క క్లిక్‌తో అందిస్తుంది. మన ఫిట్నెస్ జర్నీలో గైడ్‌లా సలహాలు సూచనలు ఇస్తుంది.
Kashmir: ప్రకృతి సౌందర్యానికి, మంచు అందాలకు నిలయమైన కాశ్మీర్ భారతదేశపు స్వర్గభూమిగా పేరొందింది. అందుకే పర్యాటకలు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే గత మూడేళ్లుగా కరోనా, లాక్డౌన్ల నేపథ్యంలో టూరిస్టుల సంఖ్య భారీగా తగ్గింది. కానీ ఇప్పుడు కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో సందర్శకులు కాశ్మీర్ లోయకు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రికార్డు స్థాయిలో ప్రజలు ఈ ప్రాంతంలో పర్యటించారు.