Steve Jobs @ Apple: ఈ భూమ్మీద మనుషులు శాశ్వతం కాదు.. వాళ్లు సంపాదించిన పేరే చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ప్రపంచ ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకునే అలాంటి వ్యక్తుల్లో స్టీవ్ జాబ్స్ ఒకరు. వరల్డ్ వైడ్‌గా యాపిల్ పండు ఎంత పాపులరో యాపిల్ కంపెనీ ప్రొడక్టులు కూడా ఇప్పటికీ అంతే ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థకు కోఫౌండర్‌గా.. సీఈఓగా.. చైర్మన్‌గా ఈ విజయంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
Today (09-01-23) Business Headlines: ‘పేటీఎం’కి సురిందర్ చావ్లా: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సురిందర్ చావ్లా నియమితులయ్యారు. ఈ నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆమోదించింది. సురిందర్ చావ్లా గతంలో ఆర్బీఎల్ బ్యాంక్ బ్రాంచ్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ హెడ్‌గా చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓగా మూడేళ్లపాటు ఉంటారు.
Indian Stocks: 2022లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ఇండియాకి గుడ్‌బై చెప్పేశారు. రూ.1.2 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ను అమ్మేశారు. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో కూడా ఇంత మంది ఫారన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌ను వీడలేదంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. పరాయి దేశాల పెట్టుబడిదారులు 2008లో దాదాపు 12 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్‌ను వదిలించుకోగా ఈసారి పదహారున్నర బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు.
Gold and Silver Markets: బంగారం, వెండి బిజినెస్ కొత్త సంవత్సరంలో ఆశాజనకంగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. 2022 కంటే 2023లో బులియన్ మార్కెట్ మంచి ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోయినేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం తక్కువ ఒడిదుడుకులే ఉంటాయని పేర్కొన్నారు. కమోడిటీ ఎక్స్ఛేంజ్లో గోల్డ్ వ్యాల్యూ అత్యధికంగా దాదాపు 19 వందల 35 డాలర్లకు చేరుతుందని, తక్కువలో తక్కువ 16 వందల 30 డాలర్ల కన్నా దిగొచ్చే ఛాన్సే లేదని చెబుతున్నారు.
Today (07-01-23) Business Headlines: గ్లాండ్ ఫార్మా చేతికి ఐరోపా సంస్థ: ఐరోపా సంస్థ సెనెగ్జి గ్రూపులో మొత్తం వాటా కొనుగోలు చేసేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ కంపెనీ గ్లాండ్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ అనుబంధ సంస్థ గ్లాండ్ ఫార్మా ఇంటర్నేషనల్ పీటీఈ ద్వారా ఈ షేరును దక్కించుకుంటుంది. దాదాపు 20 ఏళ్ల కిందట ఏర్పాటైన సెనెగ్జి గ్రూపు.. ఫ్రాన్స్ మరియు బెల్జియం దేశాల్లో ఔషధాల అభివృద్ధి, ఉత్పత్తి తదితర పనులు చేస్తోంది.
Today (06-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో కొత్త సంవత్సరం మొదటి వారం మెరుపులేమీ లేకుండానే ముగిసింది. వరుసగా మూడో రోజు కూడా.. అంటే.. ఇవాళ శుక్రవారం ఇన్ట్రా డేలోనూ నష్టాలు కొనసాగాయి. రెండు సూచీలు కూడా నేల చూపులే చూశాయి. ఉదయం అతి స్వల్ప లాభాలతో ప్రారంభమైన చివరికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 60 వేల మార్క్ నుంచి దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 18 వేల మార్క్ నుంచి పతనమైంది.
Upcoming Scooters in 2023: మన దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన వాహనాలేవి అంటే స్కూటర్లని చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ దూరాలకు ఎక్కువ మంది వీటినే వాడుతుంటారు. అందుకే వాహన తయారీ సంస్థలు స్కూటర్ల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారిస్తుంటాయి. ఈ క్రమంలో 2022లో హోండా, టీవీఎస్, సుజుకీ వంటి పెద్ద సంస్థలు తమ పాపులర్ స్కూటర్లయిన యాక్టివా, జూపిటర్ మరియు యాక్సెస్ మోడళ్లకు కొత్త వెర్షన్లను మార్కెట్లోకి తెచ్చాయి.
Today (06-01-23) Business Headlines: ఖమ్మంలో ‘గోద్రెజ్’ ప్లాంట్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ఆసక్తి ప్రదర్శించింది. ప్రపంచ స్థాయిలో వంట నూనె ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఖమ్మం జిల్లాలో ఏర్పాటుచేయనుంది. దీనికోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. ఈ మేరకు ఎండీ బలరాం సింగ్ నేతృత్వంలోని గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు నిన్న గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని కలిశారు.
Today (05-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ తీరు మారలేదు. రెండు కీలక సూచీలు కూడా నిన్నటిలాగే నష్టాల బాటలోనే నడిచాయి. ఈ రోజు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ లాస్‌లతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో షేర్ల కొనుగోళ్లు పెరగటంతో ఇంట్రాడే నష్టాల నుంచి కాస్తయినా కోలుకోగలిగాయి. సెన్సెక్స్ ఒకానొక దశలో 60 వేల 50 పాయింట్లకు పడిపోయింది.
India’s Hiring Intent: అనుభవానికి మించిన గురువు లేడంటారు. కానీ.. కంపెనీలు మాత్రం సీనియర్లకు అంత సీన్ లేదంటున్నాయి. జూనియర్లను.. ముఖ్యంగా.. ఫ్రెషర్లను ఉద్యోగంలోకి తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. టీమ్ లీజ్ అనే సంస్థ విడుదల చేసిన ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని 4వ త్రైమాసికంలో మన దేశంలోని వివిధ సంస్థల నియామకాల ఉద్దేశాలు, తీరుతెన్నులపై టీమ్ లీజ్ సర్వే నిర్వహించింది.