Today (06-01-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో కొత్త సంవత్సరం మొదటి వారం మెరుపులేమీ లేకుండానే ముగిసింది. వరుసగా మూడో రోజు కూడా.. అంటే.. ఇవాళ శుక్రవారం ఇన్‌ట్రా డేలోనూ నష్టాలు కొనసాగాయి. రెండు సూచీలు కూడా నేల చూపులే చూశాయి. ఉదయం అతి స్వల్ప లాభాలతో ప్రారంభమైన చివరికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 60 వేల మార్క్ నుంచి దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 18 వేల మార్క్ నుంచి పతనమైంది.
సెన్సెక్స్ 452 పాయింట్లు కోల్పోయి 59 వేల 900 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 126 పాయింట్లు తగ్గి 17 వేల 859 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 5 కంపెనీలు మాత్రమే లాభాల బాటలో నడిచాయి. బాంబే బుర్మా, పీవీఆర్, డాబర్ ఇండియా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
read more: Upcoming Scooters in 2023: ఈ ఏడాది రానున్న కొత్త మోడల్స్
నిఫ్టీలోని రాణించిన సంస్థల జాబితాలో బ్రిటానియా, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మహింద్రా అండ్ మహింద్రా.. టాప్‌లో నిలిచాయి. జెఎస్‌డబ్ల్యూ స్టీల్, టీసీఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ బాగా వెనకబడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ హండ్రెడ్, నిఫ్టీ స్మాల్‌క్యాప్ హండ్రెడ్ జీరో పాయింట్ 7 శాతం డౌన్ అయ్యాయి.
సెక్టార్‌ల వారీగా చూసుకుంటే నిఫ్టీలో రియాల్టీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌లు స్వల్ప లాభాలతో నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేశాయి. నిఫ్టీ ఐటీ, మీడియా, బ్యాంక్ సూచీలు ఒక శాతం వరకు నష్టపోయాయి. వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే ఐడీబీఐ బ్యాంక్ షేర్ విలువ 5 శాతం లాభపడింది. స్పెషాలిటీ రెస్టారెంట్స్ షేర్లు కూడా 6 శాతం ర్యాలీ తీసి రికార్డ్ స్థాయిలో 268 రూపాయలకు పైగానే నమోదైంది.
10 గ్రాముల బంగారం రేటు 50 రూపాయలు పెరిగి గరిష్టంగా 55 వేల 340 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 348 రూపాయలు లాభపడి అత్యధికంగా 68 వేల 426 రూపాయలు పలికింది. రూపాయి వ్యాల్యూ 5 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 76 పైసల వద్ద స్థిరపడింది.