Today (18-01-23) Business Headlines: హైదరాబాదులో పెప్సికో విస్తరణ: అమెరికన్ మల్టీ నేషనల్ ఫుడ్ కంపెనీ పెప్సికో హైదరాబాదులో కార్యకలాపాలను విస్తరించనుంది. ఏడాదిన్నర లోపు 12 వందల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. 2019లో 250 మందితో ప్రారంభమైన పెప్సికో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ఇప్పుడు 2 వేల 800 మందితో నడుస్తోంది. విస్తరణతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4 వేలకు చేరనుంది.
Telangana Government: హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 3 అధునాతన ఆస్పత్రుల నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చింది. 2 వేల కోట్ల రూపాయల విలువైన ఈ కాంట్రాక్టులకు సంబంధించి లెటర్ ఆఫ్ అవార్డును అందజేసింది. సనత్ నగర్, ఎల్బీ నగర్, ఆల్వాల్ ఏరియాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టేందుకు 3 నిర్మాణ సంస్థలను ఎంపిక చేసింది. ఈ ఆస్పత్రులను టిమ్స్ అనే పేరుతో పిలుస్తారు.
IT Companies Q3 Performance: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. అంటే.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3వ త్రైమాసికం ముగిసింది. దీంతో.. అక్టోబర్, నవంబర్, డిసెంబర్.. ఈ 3 నెలల ఉమ్మడి పనితీరుకు సంబంధించిన ఆర్థిక ఫలితాలను కంపెనీలు అధికారికంగా వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 3 దిగ్గజ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ కూడా తమ లాభనష్టాల వివరాలను ప్రభుత్వానికి అందజేశాయి.
McDonald's Business Strategy: ఇండియాలో చాలా రెస్టారెంట్లు తమ బ్రాంచ్‌లను తగ్గించుకుంటున్నాయి. అదే సమయంలో.. క్లౌడ్ కిచెన్ల సంఖ్యను పెంచుకుంటున్నాయి. అయితే.. దీనికి విరుద్ధంగా.. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, మెక్‌డొనాల్డ్స్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కొన్నేళ్లుగా క్విక్ సర్వీస్ రెస్టారెంట్ స్టోర్లను అదనంగా అందుబాటులోకి తెస్తుండటం వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Today (16-01-23) Business Headlines: డీమ్యాట్ ఖాతాల డిటెయిల్స్: డీమ్యాట్ కొత్త ఖాతాల సంఖ్య 2022 డిసెంబర్ నెలలో 34 శాతం పెరిగాయి. సెప్టెంబర్ నెలలో 20 లక్షలు, అక్టోబర్ నెలలో 18 లక్షలు, నవంబర్ నెలలో కూడా 18 లక్షల అకౌంట్లు ఓపెనయ్యాయి. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 10 పాయింట్ 8 కోట్లుగా నమోదయ్యాయి. అయితే.. 2021తో పోల్చితే మాత్రం 2022లో డీమ్యాట్ అకౌంట్లు తగ్గాయి.
Today (16-01-23) Stock Market Roundup: డిసెంబర్ నెలలో టోకు ధరలు తగ్గినప్పటికీ ఇన్వెస్టర్లలో ఏమాత్రం నమ్మకం పెరగలేదు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ బిజినెస్ కొత్త సంవత్సరంలో చెప్పుకోదగ్గ రీతిలో రాణించట్లేదు. మొదటి రెండు వారాలూ ఫ్లాట్‌గానే కొనసాగిన రెండు సూచీలు మూడో వారంలోనూ అదే ధోరణిలో వెళ్లనున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇవాళ సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. ఇంట్రాడేలో నేల చూపులు చూసి చివరికి నష్టాలతో ముగిశాయి.
Today (14-01-23) Business Headlines: ఫారెక్స్ తగ్గింది.. పసిడి పెరిగింది: ఇండియాలోని విదేశీ మారక నిల్వలు మరోసారి తగ్గాయి. తాజాగా 126 కోట్ల డాలర్లకు పైగా క్షీణించాయి. ఫలితంగా 56 వేల 158 కోట్ల డాలర్లకు చేరాయి. రూపాయి విలువను రక్షించేందకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫారెక్స్ రిజర్వులను వెచ్చిస్తుండటంతో అవి నేల చూపులు చూస్తున్నాయి. ఇది ఈ నెల 6వ తేదీ వరకు అందుబాటులో ఉన్న సమాచారం.
Exclusive Story on Ambani Companies: ఒక్కసారి ఊహించుకోండి. మనింట్లోని ప్రతి వస్తువూ ఒకే కంపెనీకి చెందినవైతే ఎలా ఉంటుందో?. ఒకే కంపెనీకి చెందినవి కాకపోయినా ఒకే వ్యక్తి నేతృత్వంలోని వివిధ సంస్థలకు చెందినవైనా అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం తినే ఫుడ్డుతో మొదలుపెట్టి.. వేసుకునే బట్టలు.. ప్రయాణం చేసే కారులోని పెట్రోల్.. ఇంటర్నెట్.. గాడ్జెట్లు.. స్పోర్ట్స్ ఇలా ప్రతి ప్రొడక్టూ.. ప్రతి సర్వీసూ.. సింగిల్ పర్సన్ నడిపించే వ్యాపార సామ్రాజ్యం నుంచే వస్తున్నాయి.
Shark Tank India’s Season-2: వ్యాపారం చేయాలనే ఆలోచన ఉండి డబ్బు లేనివారి కోసం షార్క్ ట్యాంక్ ఇండియా పేరుతో నిర్వహించిన రియాలిటీ షో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షోలో మన బిజినెస్ ఐడియాలతో ఇన్వెస్టర్లను మెప్పించగలిగితే వాళ్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారు. ఫస్ట్ సీజన్లో దేశవ్యాప్తంగా 62 వేల మంది ఔత్సాహికులు తమ ఆలోచనలను ఈ వేదికగా పంచుకున్నారు.
Top Executives Resignations: చిన్న ఉద్యోగులు కంపెనీలు మారటం సహజం. కానీ.. 2022లో పెద్ద పెద్ద సంస్థల్లో చాలా మంది పెద్దలు రాజీనామాలు చేశారు. ఉన్న కంపెనీలకు గుడ్‌బై చెప్పి వేరే సంస్థల్లో పెద్ద పోస్టుల్లో జాయిన్ అయ్యారు. రిజైన్ చేసినవాళ్ల ప్లేసులో కొత్తవాళ్లను తీసుకున్నారు. ఇలా రాకపోకలు జరిగిన నవతరం కంపెనీల జాబితాలో జొమాటో, భారత్‌పే, నైకా, మెటా ఇండియా, వాట్సాప్ పే, అమేజాన్ ఇండియా, ట్విట్టర్, PAYU, మారికో, జూబిలంట్ ఫుడ్‌వర్క్స్, స్నాప్ వంటి సంస్థలున్నాయి.