Lava Play Max 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మరోసారి ప్లే సిరీస్‌లో కొత్తగా లావా ప్లే మ్యాక్స్ 5G (Lava Play Max)ను మార్కెట్‌లోకి తీసుకుని వచ్చింది. ఈ సంవత్సరం విడుదలైన ప్లే అల్ట్రాకు అప్‌గ్రేడ్‌గా వచ్చిన ఈ మోడల్, 5G పనితీరు, సరైన రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, శక్తివంతమైన చిప్‌సెట్ వంటి ఫీచర్లను తక్కువ ధరలో అందించడం ప్రత్యేకత. లావా ప్లే మ్యాక్స్ 5Gలో MediaTek Dimensity 7300 4nm ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ధర విభాగంలోనే మొదటిసారిగా వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీని అందించడం గమనార్హం. దీని ద్వారా భారీ పనులు, దీర్ఘకాలిక గేమింగ్ సమయంలో కూడా ఫోన్ స్థిరంగా పనిచేస్తుంది. ఫోన్‌లో 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను అమర్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా యూజర్లు స్క్రోలింగ్, గేమింగ్‌ను పూర్తిగా ఫ్లూయిడ్‌గా అనుభవించవచ్చు.

మెమరీ పరంగా ఈ మోడల్ 8GB LPDDR4X ర్యామ్ వరకు అందించబడుతుంది. దీనితోపాటు 8GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. స్టోరేజ్ కోసం వేగవంతమైన 128GB UFS 3.1ను అందించగా, microSD సహాయంతో 1TB వరకు విస్తరించుకోవచ్చు. కెమెరా విభాగంలో 50MP రియర్ ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. రియర్ కెమెరా EIS సపోర్ట్‌తో పాటు 4K 30fps వీడియో రికార్డింగ్‌ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ తాజా ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. బ్లోట్‌వేర్ లేకుండా పూర్తిగా క్లీన్ UI అనుభవం ఇస్తుందనేది మరో కీలక అంశం. పవర్ కోసం 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. వీటితోపాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉన్నాయి.

Devineni Avinash: 18 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది..? వైసీపీ నాయకుడు ఘాటు వ్యాఖ్యలు..!
లావా ప్లే మ్యాక్స్ 5G డెక్కన్ బ్లాక్, హిమాలయన్ వైట్ గా రెండు కలర్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇక ధరలు చూస్తే.. 6GB + 128GB వేరియంట్‌కు రూ.12,999, 8GB + 128GB వేరియంట్‌కు రూ.14,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ డిసెంబర్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న లావా స్టోర్లలో లభ్యం కానుంది. ఇక లావా అందించే ఫ్రీ సర్వీస్ ను హోమ్ సదుపాయం ఈ మోడల్‌కూ వర్తిస్తుంది.
No lag. No heat. Just game.#PlayMax #ComingSoon #LavaMobiles #GamingBeast pic.twitter.com/XtHw4O5E70
— Lava Mobiles (@LavaMobile) December 6, 2025