* నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజీ భవనం దగ్గర సభ.. సర్వం సిద్ధం పేరుతో సభ ఏర్పాటు.. వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయల కోసం ఇప్పటికే రూ. 1000 కోట్లు ప్రకటించిన సీఎం.. విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో వర్సిటీ డీపీఆర్ రెడీ..
* నేడు హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు.. రాణిగంజ్ డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. అనంతరం టీజీఆర్టీసీ ఉద్యోగులతో పొన్నం వీడియో కాన్ఫరెన్స్..
* నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన.. ఆటో డ్రైవర్లకు ఆత్మీయ భరోసా కార్యక్రమం.. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ..
* నేడు ఐఏఎస్ పోస్టులపై హైకోర్టులో విచారణ.. ఐఏఎస్ పోస్టులను ఐపీఎస్ లకు కేటాయించడంపై విచారణ..
* నేటి నుంచి జీహెచ్ఎంసీలో వార్డుల డీలిమిటేషన్ పై అభ్యంతరాల స్వీకరణ.. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ ఆఫీసుల్లోనూ అభ్యంతరాల స్వీకరణ.. కేవలం లిఖిత పూర్వకంగా మాత్రమే అభ్యంతరాల స్వీకరణకు అవకాశం.. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యాక, కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం సేకరించనున్న అధికారులు..
* నేడు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్..
* నేడు బీజేపీ కార్పొరేటర్లతో రామచందర్ రావు భేటీ.. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై చర్చ..
* నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెవోడీల సమావేశం.. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 45 వరకు మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్ష.. వృద్ధిరేటు పెంపునకు రానున్న నాలుగు నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై చర్చ..
* నేడు ఉదయం 10: 30 గంటలకు సీకే కన్వెన్షన్ లో డిప్యూటీ సీఎం పవన్ మాటామంతీ కార్యక్రమం.. మూడు శాఖల అధికారులు, సిబ్బందితో విస్తృత సమావేశం.. గ్రామాల్లోని తాగునీరు, సాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ, పాఠశాల విద్య, నిరుద్యోగం వంటి సమస్యలు, డెవలప్మెంట్స్ పై కీలక చర్చ.. చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రధానంగా ఫోకస్..
* నేడు విజయవాడలో మాజీ సీఎం జగన్ పర్యటన.. తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో భేటీకానున్న జగన్..
* నేడు కడప మేయర్ ఎన్నికపై హైకోర్టు ఆర్డర్స్.. మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన సురేశ్ బాబు.. సురేశ్ బాబు పిటిషన్ పై ఆర్డర్స్ ఇవ్వనున్న హైకోర్టు..
* నేడు విజయవాడ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం.. భవానీపురంలో ఇళ్ల కూల్చివేతపై చర్చించే అవకాశం..
* నేడు పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు కీలక అంశాలపై కొనసాగనున్న చర్చ.. లోక్ సభలో ఎన్నికల సంస్కరణలు, రాజ్యసభలో ఎస్ఐఆర్, వందేమాతరంపై కొనసాగనున్న చర్చ..