IndiGo: ప్రయాణీకులను ఏడిపించినందుకు ఇండిగోకు భారీ శిక్ష విధించారు! ఇండిగో విమానాలలో 10% సర్వీసులను తగ్గించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌ను పిలిపించారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోపు సవరించిన షెడ్యూల్‌ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి సమర్పించాలని ఇండిగోను ఆదేశించారు. మంత్రిత్వ శాఖ నిర్ణయంతో ఇండిగో సుమారు 2,200 రోజువారీ విమానాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దాదాపు 220 విమాన సర్వీసులు తగ్గిస్తారు!
READ MORE: Akhanda2Thandavam : అఖండ 2 టికెట్స్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వ జీవో వచ్చేసింది
నిజానికి, ఇండిగోకి చెందిన అనేక విమానాలు ఒక వారానికి పైగా రద్దు చేశారు. డిసెంబర్ 2 నుంచి వేలాది విమానాలు రద్దు చేశారు. మంగళవారం మాత్రమే 400 కి పైగా విమానాలు ప్రభావితమయ్యాయి. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి విమానాశ్రయాలు అంతరాయం కలిగింది. ఇండిగో ఇప్పటివరకు రూ.827 కోట్లు తిరిగి చెల్లించింది. కానీ ప్రయాణీకుల సమస్యల సంగతేంటి? అనే ప్రశ్న తలెత్తింది. ఎంతో మంది ప్రయాణికుల అనేక ఇబ్బందులు పడ్డారు. కొందరు రోజుల పాటు పడిగాపులుకాశారు.. ఓ వ్యక్తి పెళ్లి సైతం రద్దైంది. ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ కస్టమర్లకు క్షమాపణలు చెప్పారు. మరో అవకాశం ఇవ్వాలని కోరారు.
READ MORE: Jasprit Bumrah: 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా.. జస్‌ప్రీత్ బుమ్రా నయా రికార్డు
ఇటీవల DGCA తీసుకున్న కొత్త నిబంధనల గురించి ఇండిగో ప్రభుత్వానికి సమాచారం అందించలేదని ప్రభుత్వం తెలిపింది. కొత్త నిబంధనలను పాటించడానికి అది అంగీకరించింది. కానీ వాటిని అమలు చేయడంలో విఫలమైంది. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రభుత్వం లాగే, పార్లమెంటరీ కమిటీ సైతం ఇప్పుడు ఇండిగో కుంభకోణంపై కఠినమైన వైఖరి తీసుకుంటోంది. అన్ని విమానయాన సంస్థలు, DGCA లను పిలిపించబోతోంది. మరోవైపు.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇండిగో ఇలా చేసిందని చాలా మంది నిపుణులు ఆరోపించారు. అది తన పెద్ద మార్కెట్ వాటాను ప్రదర్శించడానికి ప్రయత్నించింది. కానీ ప్రభుత్వం దానిని అడ్డుకుందని వివరించారు.