Nissan Magnite: నిస్సాన్ మ్యాగ్నైట్ సంబంధించిన ఈ డిసెంబర్ నెల ఆఫర్లు ఈసారి వినియోగదారులకు భారీ మొత్తంలో ప్రయోజనాలు అందిస్తున్నాయి. వేరియంట్‌ను బట్టి కనీసం రూ. 50,000 నుంచి గరిష్టంగా రూ. 1.36 లక్షల వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. క్యాష్ బెనిఫిట్లు, ఎర్లీ బుకింగ్ బోనస్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, కార్పొరేట్ బెనిఫిట్లతో కూడిన ఈ ఆఫర్లు నిస్సాన్ మ్యాగ్నైట్ అన్ని వేరియంట్‌లకు వర్తించనున్నాయి.
Cricket Marriage Controversies: స్నేహం–వివాహం–వివాదం! స్నేహితుడి భార్యతో స్టార్ క్రికెటర్..
ఈ ఆఫర్స్ లో భాగంగా నాన్ టర్బో వేరియంట్‌లలో Visia, Visia+, Kuro ట్రిమ్‌లకు రూ. 10,000 క్యాష్ బెనిఫిట్, ఇతర కార్ల మార్పిడిపై రూ. 20,000 లభించనుంది. ఇక నిస్సాన్ లేదా రెనాల్ట్ మోడల్‌ల ఎక్స్‌చేంజ్‌పై రూ. 40,000 ప్రయోజనం లభిస్తుంది. కార్పొరేట్ ఆఫర్ లేకపోయినా రూ. 50,000 వరకు లభిస్తుంది. అలాగే అసెంటా, N-కనెక్ట వేరియంట్‌లలో రూ. 10,000 క్యాష్, రూ. 7,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్లపై రూ. 30,000, నిస్సాన్ లేదా రెనాల్ట్ కార్లపై రూ. 50,000 ఎక్స్‌చేంజ్ బోనస్‌తో పాటు రూ. 5,000 కార్పొరేట్ ఆఫర్ కూడా ఉంది. దీని ద్వారా రూ. 72,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఇక టెక్న, టెక్న+ వేరియంట్‌ల్లో మరింత ఎక్కువగా సేవ్ చేసుకోవచ్చు. రూ. 10,000 క్యాష్, రూ. 25,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్లపై రూ. 50,000, నిస్సాన్ లేదా రెనాల్ట్ కార్లపై రూ. 60,000తో పాటు రూ. 5,000 కార్పొరేట్ ఆఫర్ కలిపి మొత్తం ప్రయోజనం రూ. 1,16,000కు ప్రయోజనం అందుతుంది.
EZ-Shift వేరియంట్‌లలో కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. Visia EZ-షిఫ్ట్ లో రూ. 5,000 క్యాష్, రూ. 12,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్లపై రూ. 20,000, నిస్సాన్/రెనాల్ట్ ఎక్స్‌చేంజ్‌పై రూ. 40,000తో పాటు రూ. 5,000 కార్పొరేట్ ప్రయోజనం లభిస్తుంది. దీనితో మొత్తం రూ. 62,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అసెంటా, N-కనెక్ట EZ-షిఫ్ట్ ట్రిమ్ లలో రూ. 10,000 క్యాష్, రూ. 12,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్ల మార్పిడిపై రూ. 40,000, నిస్సాన్/రెనాల్ట్ కార్లపై రూ. 60,000, రూ. 5,000 కార్పొరేట్ బెనిఫిట్‌తో మొత్తం రూ. 87,000 ప్రయోజనం ఉంటుంది. కురో, టెక్న, టెక్న+ EZ-షిఫ్ట్ వేరియంట్‌లలో మరింత మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో రూ. 10,000 క్యాష్, రూ. 25,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్లపై రూ. 50,000, నిస్సాన్/రెనాల్ట్ కార్లపై రూ. 60,000, రూ. 5,000 కార్పొరేట్ ఆఫర్‌తో మొత్తం రూ. 1,16,000 ప్రయోజనాలు పొందవచ్చు.
IndiGo: నార్మలైజ్ అంటే ఇదేనా?.. ఇండిగో సీఈఓ పోస్ట్‌పై నెటిజన్ల ఫైర్
ఇక టర్బో వేరియంట్‌లలో Turbo MT మోడళ్లకు అన్ని వేరియంట్‌లలో ఒకే రకమైన ఆఫర్లు వర్తిస్తాయి. రూ. 10,000 క్యాష్, రూ. 20,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్లపై రూ. 50,000, నిస్సాన్/రెనాల్ట్ కార్లపై రూ. 60,000 బోనస్, రూ. 5,000 కార్పొరేట్ బెనిఫిట్‌తో మొత్తం రూ. 1,11,000 లభిస్తుంది. టర్బో CVT వేరియంట్‌లలో అత్యధిక డిస్కౌంట్ అసెంటా మోడల్‌కే లభిస్తుంది. రూ. 20,000 క్యాష్, రూ. 35,000 ఎర్లీ బుకింగ్ బోనస్, ఇతర కార్ల పై రూ. 50,000, నిస్సాన్/రెనాల్ట్ మోడల్‌లపై రూ. 60,000, రూ. 5,000 కార్పొరేట్ ప్రయోజనంతో మొత్తం రూ. 1,36,000 డిస్కౌంట్ లభిస్తుంది. మిగతా Turbo CVT వేరియంట్‌లైన N-Connecta, Kuro, Tekna మరియు Tekna+ మోడళ్లకు రూ. 1,03,000 ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.