Honor Magic 8 Lite: హానర్ (Honor) కంపెనీ యూకే మార్కెట్‌లో Honor Magic 8 Lite స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ భారీ 7,500mAh సిలికాన్–కార్బన్ బ్యాటరీ, బలమైన బాడీ, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ రోజువారీ హెవీ యూజ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. అలాగే ఇందులో మెరుగైన డిస్‌ప్లే క్వాలిటీ, మెరుగైన కెమెరా పనితీరు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.
Hardik Pandya: వారికి హార్దిక్ పాండ్యా సీరియస్ వార్నింగ్..
హానర్ ఇప్పటివరకు Magic 8 లైట్ ధరను వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్ 2026 ప్రారంభంలో యూకే మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. EE, వర్జిన్ మీడియా O2, వోడాఫోన్, త్రీ, టెస్కో మొబైల్, కరిస్, అర్గోస్, వెరీ, అమెజాన్, AO, జాన్ లెవీస్ వంటి ప్రముఖ రిటైల్ భాగస్వామ్యాల ద్వారా విక్రయించబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్, రెడ్డీస్ బ్రౌన్ వంటి మూడు కలర్ వేరియంట్‌లలో వస్తుంది.
ఈ Honor Magic 8 Lite లో 6.79 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందించారు. 6,000 నిట్స్ పీక్ HDR బ్రైట్‌నెస్, 1.3mm అల్ట్రా న్యారో బెజెల్స్, 94.6 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో వంటి హైలైట్ ఫీచర్లు ఉన్నాయి. కంటి సంరక్షణ కోసం 3840Hz PWM డిమ్మింగ్, సర్కేడియన్ నైట్ డిస్‌ప్లే, AI డిఫోకస్ డిస్‌ప్లే, డైనమిక్ డిమ్మింగ్, లో బ్లూ లైట్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే AI హెవీ రైన్ టచ్, AI గ్లోవ్ టచ్ వంటి స్మార్ట్ టచ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ కోసం Snapdragon 6 Gen 4 చిప్‌సెట్, 8GB ర్యామ్, గరిష్టంగా 512GB స్టోరేజ్ అందించారు. అదనంగా 8GB వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉంటుంది.
Satya Kumar Yadav: డ్రగ్స్ పైన నిఘా పెట్టాలి.. చీటీ లేకుండా మందులు ఇస్తే కఠిన చర్యలు!
కెమెరా విషయంలో 108MP ప్రధాన సెన్సర్‌తో OIS, EIS సపోర్ట్ అందించారు. 4K HD మూవింగ్ ఫోటో కొలాజ్, హానర్ కనెక్షన్ ద్వారా iOS ఫోటో ట్రాన్స్‌ఫర్ సపోర్ట్, AI రేజర్, AI కట్ అవుట్, AI అవుట్ పెయింటింగ్ వంటి AI ఫోటోగ్రఫీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఉన్న 7,500mAh సిలికాన్–కార్బన్ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు పనిచేస్తుందని హానర్ తెలిపింది. ఆరు సంవత్సరాల తరువాత కూడా 80 శాతం కన్నా ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని నిలుపుకుంటుందని కంపెనీ తెలిపింది. 2 శాతం బ్యాటరీతో కూడా 60 నిమిషాల కాలింగ్‌కు సపోర్ట్ చేసే అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్ అందుబాటులో ఉంది. చార్జింగ్ విషయానికి వస్తే.. ఇది 66W Honor సూపర్ ఛార్జ్, 7.5W రివర్స్ వైర్డ్ చార్జింగ్ ఉంది. డ్యూరబిలిటీ పరంగా SGS ట్రిపుల్ రెసిస్టెంట్ ప్రీమియం పెర్ఫార్మన్స్ సర్టిఫికేషన్, SGS 5-స్టార్ కంప్రెహెన్సివ్ రెలియబిలిటీ సర్టిఫికేషన్ వంటి గుర్తింపులు పొందింది. హానర్ అల్ట్రా-బౌన్స్ యాంటీ-డ్రాప్ టెక్నాలజీ, కొత్త అల్ట్రా-డీప్ టెంపర్డ్ గ్లాస్, IP69K+IP68 రేటింగ్‌తో బలమైన రక్షణ కలిగి ఉంది.