Upcoming Scooters in 2023: మన దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన వాహనాలేవి అంటే స్కూటర్లని చెప్పొచ్చు. ఎందుకంటే తక్కువ దూరాలకు ఎక్కువ మంది వీటినే వాడుతుంటారు. అందుకే వాహన తయారీ సంస్థలు స్కూటర్ల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారిస్తుంటాయి. ఈ క్రమంలో 2022లో హోండా, టీవీఎస్, సుజుకీ వంటి పెద్ద సంస్థలు తమ పాపులర్ స్కూటర్లయిన యాక్టివా, జూపిటర్ మరియు యాక్సెస్ మోడళ్లకు కొత్త వెర్షన్లను మార్కెట్‌లోకి తెచ్చాయి.
2023లో సైతం మల్టిపుల్ లాంఛింగ్‌లకు సిద్ధమవుతున్నాయి. తద్వారా కస్టమర్లకు నూతన ఆప్షన్లను అందుబాటులోకి తేవటానికి రెడీ అయ్యాయి. ఒక వైపు ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ ఏడాది ఎలాంటి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ స్కూటర్లు తెర మీదికి రానున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని అప్‌కమింగ్ స్కూటర్ల గురించి చూద్దాం.
read more: India’s Hiring Intent: ‘అనుభవం’ ఎవరికి కావాలండి?. Q4లో సంస్థల నియామక ఉద్దేశాలు.
హోండా కంపెనీ.. యాక్టివా 7జీ మోడల్‌ను తీసుకురానుంది. దీని డిజైన్ చాలా వరకు 6జీ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే కొత్త వెర్షన్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇన్‌స్టాల్ చేసే అవకాశముంది. 6జీలో ఉన్నట్లే 7జీలో కూడా వన్నాట్ నైన్ పాయింట్ ఫైవ్ వన్ సీసీ ఇంజన్ అమర్చనున్నారు. ఇది సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్.. లీటర్ పెట్రోల్‌కి 50 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
హోండా యాక్టివాకి కొన్నేళ్లలోనే టీవీఎస్ జూపిటర్ బలమైన పోటీదారుగా ఎదిగింది. టీవీఎస్ కంపెనీ 2023లో జూపిటర్ రేంజ్‌లో 4 అప్‌డేటెడ్ వేరియంట్లను లాంఛ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. బేసిక్ జూపిటర్, జూపిటర్ జెడ్‌ఎక్స్, జూపిటర్ క్లాసిక్, టాప్-ఎండ్ జూపిటర్ 125 పేర్లతో వీటిని ఆవిష్కరించనుంది. ఫీచర్లను, స్పెసిఫికేషన్లను ఎక్కువగా ప్రస్తుతం ఉన్న మోడళ్ల మాదిరిగానే కొనసాగించనున్నారు. కాకపోతే డిజైన్‌పరంగా కొన్ని అప్‌గ్రేడ్‌లు చేయనున్నారు.
సుజుకీ యాక్సెస్‌ను మరో పాపులర్ స్కూటర్‌గా పేర్కొనొచ్చు. ఇది 125 సీసీ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చూపుతోంది. యాక్టివా మరియు జూపిటర్‌లతో పోటీ పడేందుకు ఈ సంవత్సరం అప్‌గ్రేడెడ్ యాక్సెస్‌ను లాంఛ్ చేయనుందని చెబుతున్నారు. డిజైన్‌లోను మరియు డిజిటల్ క్లస్టర్‌లోను మార్పులు చేపట్టనుంది. ఇంజన్ విషయానికొస్తే.. ప్రజెంట్ మోడల్‌లో వాడుతున్న 124 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌నే వినియోగించాలని చూస్తోంది.
సుజుకీ సంస్థ 2023లో మన దేశంలో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 ఈఎక్స్ మోడల్ స్కూటర్‌ను లాంఛ్ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాదిలోని తొలి 6 నెలల్లోపే ఈ టాప్-ఎండ్ వేరియంట్‌ను ప్రారంభించనుంది. ఇందులో.. డిజైన్‌ను మెరుగుపరచనున్నారు. 12 ఇంచ్‌ల సైజులో ఉండే పెద్ద రియర్ టైర్, సైలెంట్ స్టార్టర్ మరియు ట్వంటీవన్ పాయింట్ ఫైవ్ లీటర్ అండర్ సీట్ స్టోరేజ్‌తోపాటు మరిన్ని ఫీచర్లను అందించనున్నారు.
అప్రిలియా సంస్థ ఈ సంవత్సరం మ్యాక్సీ స్కూటర్‌ను లాంఛ్ చేయనుంది. ఈ వాహనాన్ని 2022 జులైలోనే చైనాలో ఆవిష్కరించింది. భారత్‌లో ఎట్టకేలకు 2023లో అందుబాటులోకి తేనుంది. ఈ స్కూటర్‌లో 244 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది 26 హార్స్ పవర్‌ను మరియు ట్వంటీటూ పాయింట్ ఫైవ్ ఎన్‌ఎం పీక్ టర్క్‌ను జనరేట్ చేస్తుంది. 7 అంగుళాల స్క్రీన్ కలిగిన ఈ వాహనం ప్రీమియం స్కూటర్‌గా నిలవనుంది.