దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి డిసెంబర్ 2024లో భారీగా కార్లను విక్రయించింది. కంపెనీ దేశీయ మార్కెట్లో మొత్తం 1,30,117 ప్యాసింజర్ వాహనాలను అమ్మింది. 2023 ఏడాది డిసెంబర్లో 1,04,778 యూనిట్లతో పోలిస్తే 24.1% వృద్ధిని నమోదు చేసింది.
2024 ఏడాది భారత ఆర్థిక వ్యవస్థకు మెరుగ్గా పరిగణించారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు జీఎస్టీ వసూళ్లు ద్వారా ప్రభుత్వానికి మొత్తం 21 లక్షల 51 వేల కోట్ల రూపాయలు వచ్చాయి. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో జీఎస్టీ వల్ల ప్రభుత్వానికి కాస్త తక్కువ ఆదాయం వచ్చింది. నవంబర్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1.82 లక్షల కోట్లు కాగా.. డిసెంబర్లో రూ.1.77 లక్షల కోట్లకు తగ్గింది.
దేశవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యూ ఇయర్ అట్టహాసంగా కొనసాగాయి. ప్రజలంతా కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలికారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రజలు డీజేలు, డ్యాన్స్‌లు, విందులతో సందడి చేశారు.
కేరళ తిరువనంతపురంలోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓ ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ కేసులో టీచర్ దోషిగా తేలాడు. మైనర్ బాలికను ప్రలోభపెట్టి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణపై అరెస్ట్ అయ్యాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. టీచర్‌ను దోషిగా తేల్చింది. జైలు శిక్షతో పాటు రూ.1.05 లక్షల జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 44 ఏళ్ల ఉపాధ్యాయుడు నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకుంటే మరో ఏడాది పాటు జైలులో ఉండాల్సిందేనని…
భారతదేశం గతంలో వ్యవసాయంపై ఆధారపడింది. ప్రపంచీకరణ తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా మారిపోయింది. వ్యవసాయంపై ప్రజలు ఆధారపడటం తగ్గిపోయింది. శ్రమ భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించింది. అయితే.. ఉపాధిపై ఆధారపడటం పెరిగింది. దేశంలో పరిశ్రమల వృద్ధి కారణంగా ఉద్యోగావకాశాలు కూడా పెద్దఎత్తున సృష్టించబడ్డాయి.
26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రమేయం ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన కెనడా వ్యాపారవేత్త తహవ్వూర్ రాణాను త్వరలో భారత్‌కు అప్పగించవచ్చు. రాణాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ దౌత్య మార్గాల్లో సాగుతోంది. 2024 ఆగస్ట్‌లో.. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం.. రాణాను భారత్‌కు అప్పగించవచ్చని యూఎస్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే భారత్‌కు తీసుకొచ్చి.. ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం రాత్రి పీఎస్ఎల్వీ-సీ 60 (PSLV-c60) రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి పంపింది. రాత్రి 10 గంటల 15 సెకెన్లకు నింగిలోకి దూసుకెళ్లింది. భారతదేశ అంతరిక్ష పరిశోధనలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా ఇస్రో అభివర్ణించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.
మరో కొన్ని గంటల్లో 2024కు వీడ్కోలు పలికి.. 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాలు వేడుకలకు సిద్ధమవుతున్నాయి. 2024 డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలను ఎలా జరపుకోవాలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటారు. అయితే దీన్ని ఆరోగ్యకరమైన రీతిలోనూ, ఆహ్లాదంగానూ జరుపుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని పెద్దలు చెబుతున్నారు.
రేపు హైకోర్టులో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణ జరగనుంది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. రేపటితో కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ముగియనున్నాయి. కేటీఆర్ ను అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ఏసీబీ కోర్టును మరోసారి కోరనుంది. రాజకీయ కక్షతో ఈ కేసులో తనను ఇరికించారని కేటీఆర్ సమాధానమిచ్చారు.
అదానీ గ్రూపునకు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్ షేర్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. విల్మార్ లిమిటెడ్‌లో అదానీ గ్రూప్ తన వాటాను విక్రయించడానికి ప్రయత్నిస్తోందని చాలా కాలంగా బలమైన చర్చ జరిగింది. ఈరోజు ఈ అంశానికి ఆమోదం కూడా లభించింది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అదానీ విల్మార్ లిమిటెడ్ నుంచి నిష్క్రమించాలని అదానీ గ్రూప్ తన విక్రయాలను రెండు దశల్లో పూర్తి చేస్తుంది. అదానీ విల్మార్లో అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మొత్తం వాటా 44 శాతం కలిగి ఉంది.