డిసెంబర్ 2024 విమాన ప్రయాణీకులకు 'బ్లాక్ నెల'గా మారింది. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా 6 విమాన ప్రమాదాలు జరిగాయి. 233 మంది మరణించారు. ఈ గణాంకాలు నిజంగా భయానకంగా మారాయి. ఈ ప్రమాదాలు విమాన ప్రయాణ సమయంలో భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దక్షిణ కొరియాలోని . ముయాన్ విమానాశ్రయంలో ఆదివారం విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పింది.
గుడి-మసీదు వివాదంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ యోగి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నివాసంలో శివలింగం ఉందని, అక్కడ కూడా తవ్వకాలు జరపాలన్నారు. ఆదివారం లక్నోలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంభాల్ సహా పలు జిల్లాల్లో జరుగుతున్న తవ్వకాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. ఆస్ట్రేలియా-ఇండియా జట్ల మధ్య మెల్బోర్న్ లో నాల్గవ టెస్టు మ్యా్చ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. 8వ నెంబర్లో బ్యాటింగ్‌కు దిగిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఎనిమిదో నంబర్లో సెంచరీ సాధించిన రెండవ భారతీయ క్రికెటర్ గా నిలిచాడు. కాగా ఆసీస్ ను వారి సొంత గడ్డపైనే దడదడలాడించిన నితీశ్ రెడ్డిపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గోవా నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాస్కోడిగామా రైల్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. 43 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. గోవా వస్తున్న వాస్కోడిగామా రైల్లో మద్యం తీసుకు వస్తున్నారని సమాచారం అందింది. ఈ మేరకు ఏఈ ఎస్ జీవన్ కిరణ్, ఎస్ టి ఎఫ్, డిటిఎఫ్ సీఐలు సుభాష్ చందర్, బాలరాజు, ఎస్సైలు వెంకటేష్, రవిలతో పాటు 20 మంది సిబ్బంది శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు తనిఖీలు నిర్వహించారు. పలువురు వద్ద ఉన్న 43 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మానవ సంబంధాలు తలదించుకునే ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ బస్తా ప్రాంతానికి చెందిన దంపతులు బైక్ కొనుక్కోవాలనే కారణంతో తమ తొమ్మిది రోజుల నవజాత శిశువును విక్రయించారు. ఆ దంపతులు తమ అమాయకపు బిడ్డను కేవలం రూ.60 వేలకే వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఈ అక్రమ చర్యపై సమాచారం అందుకున్న పోలీసులు నవ దంపతుల నుంచి చిన్నారికి విముక్తి కల్పించారు. నిందితులైన దంపతులు, తమ బిడ్డను పెంచలేకపోవడం వల్లే తమ బిడ్డను దానం చేశామని చెప్పారు.
పెళ్లిళ్లలో డబ్బు వృథా చేయడం పెద్ద విషయం కాదు కానీ.. పాకిస్థాన్‌లో ఓ పెళ్లిలో డబ్బులు వృథా చేసిన తీరుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక తండ్రి తన కొడుకు పెళ్లి కోసం విమానం బుక్ చేశాడు. ఈ విమానం వధువు ఇంటిపై డబ్బు వర్షం కురిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎగతాలి చేస్తున్నారు.
ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ముంబైలో కూడా ఇలాంటి కేసు ఒకటి బయటకు వచ్చింది. అయితే ఇక్కడ యువకుడి చాకచక్యం చూసి దుండగుడే నవ్వుకున్నాడు. కొంత సమయం తర్వాత స్కామర్ స్వయంగా ఫోన్‌ను డిస్కనెక్ట్ చేయవలసి వచ్చింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. జనాలు నవ్వు ఆపుకోలేక పోతున్నారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతిపై సినీ, క్రీడా ప్రముఖులు మౌనం వహించడాన్ని ప్రశ్నించారు. మాజీ ప్రధాని మృతికి నివాళులు అర్పించే విషయంలో క్రీడా, సినీ రంగ ప్రముఖులు మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు.
లోక్‌సభ ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఓటింగ్ గణాంకాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ఓటరు జాబితాలో తమ పేర్లను చేర్చుకునే సమయంలో వీరిలో చాలా ఉత్సాహం కనిపించిందని ఎన్నికల సంఘం తెలిపింది. ఓటరు జాబితాలో 1.2 లక్షల మంది తమ పేర్లను చేర్చుకోగా, ఎన్నికల సమయంలో కేవలం 2.48 శాతం మంది మాత్రమే ఓటు వేయడానికి భారతదేశానికి వచ్చారు.
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానంతరం అంత్యక్రియలు, స్మారకాల విషయంలో రాజకీయాలు మొదలయ్యాయి. ఈ అంశంపై పీవీ నరసింహారావు సోదరుడు మనోహర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పీవీ నరసింహారావుకు కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్నారు. ఢిల్లీలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించి స్మారక చిహ్నం నిర్మించాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారని గుర్తు చేశారు.