బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మాయలో పడి వేల సంఖ్యలో యువకులు ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణ పోలీసులు వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం మియాపూర్ పీఎస్ పరిధలో 25మందిపై నమోదు నమోదు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, ప్రణీత, నిధి అగర్వాల్ ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంపై విజయ్, ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా రానా దగ్గుబాటి కూడా వివరణ ఇచ్చారు.
“నైపుణ్యం ఆధారిత గేమ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి రానా దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని గడువు 2017లో ముగిసింది. ఆన్‌లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్‌లను చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమోదం తెలిపారు. ఒప్పందాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్ని భాగస్వామ్యాలను క్షుణ్ణంగా సమీక్షిస్తుంది. చట్టపరమైన సమీక్ష తర్వాత, చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉండేలా ప్లాట్‌ఫామ్‌ను రానా అంగీకరించాడు. నైపుణ్యం ఆధారిత గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను రానా దగ్గుబాటి ఆమోదించడం చట్టానికి పూర్తిగా అనుగుణంగా ఉందని చెప్పడానికే నిర్ధారించడానికి ఈ ప్రెస్ నోట్ జారీ చేస్తున్నాం. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్‌లైన్ గేమ్‌లను హైలైట్ చేయడం చాలా అవసరం. ఈ గేమ్‌లు అవకాశం మీద కాకుండా నైపుణ్యం మీద ఆధారపడి ఉన్నాయని, అందువల్ల చట్టబద్ధంగా అనుమతించబడతాయని కోర్టు తీర్పు ఇచ్చింది.” అని రానా దగ్గుబాటి పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది.