ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై స్పందించారు. తన పేరు ప్రస్తుతం చర్చకు వస్తుండటంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎక్స్ వేదికగా వీడియోను విడుదల చేసిన ఆయన, గతంలో తాను ఓ గేమింగ్ యాప్ యాడ్ చేసిన విషయాన్ని అంగీకరించారు. అయితే, ఆ ప్రకటనను చేయడం తప్పుడు నిర్ణయమని తెలుసుకుని, తానే స్వయంగా ఒప్పందాన్ని పొడిగించకుండా నిష్క్రమించానని స్పష్టం చేశారు.
READ MORE: CM Revanth Reddy: వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది.. టీటీడీ వివాదంపై స్పందించిన సీఎం..
“నేను చేసిన యాడ్ గురించి చర్చ జరుగుతుందని తెలిసింది. 2016లో ఆ యాడ్ నా దగ్గరకు వచ్చింది, నేను ఆ యాడ్ చేసిన మాట నిజం. ఆ యాడ్ చేయడం తప్పని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లో ఒప్పందం పొడిగిస్తామని అడిగారు. ఆ యాడ్ ను ప్రసారం చేయవద్దని కోరాను. 9 ఏళ్ల కిందట ఏడాది ఒప్పందంతో ఆ యాడ్ చేశాను. నేను ఇప్పుడు ఏ గేమింగ్ యాప్ లకు ప్రచారకర్తగా పనిచేయడం లేదు. 2021లో ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేస్తే సోషల్ మీడియాలో నా ప్రకటన వాడారు. నా ప్రకటన వాడినందుకు ఆ కంపెనీకి లీగల్ నోటీసులు పంపాను. ఇప్పటి వరకు పోలీసు శాఖ నుంచి నాకు ఎలాంటి సందేశం రాలేదు. నేను చేసిన యాడ్ పై పోలీసులకు వివరణ ఇస్తాను.” అని నటుడు ప్రకాశ్ రాజ్ వివరణ ఇచ్చారు.
My response 🙏🏿🙏🏿🙏🏿 #SayNoToBettingAps #justasking pic.twitter.com/TErKkUb6ls
— Prakash Raj (@prakashraaj) March 20, 2025