పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగాల్లో వివిధ పోస్టులకు ఎంపికైన 922 మందికి అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అభ్యర్థులు నియామక పత్రాలు గురించి దశాబ్దకాలం ఎదురుచూశారన్నారు. ఉద్యోగ బాధ్యత అనిర్వచనీయ ఆనందాయకమని తెలిపారు. “నేను జడ్పీటీసీ అయినప్పుడు ఎంతో సంతోష పడ్డ. సీఎం అయినప్పటి కంటే ఎక్కువ అప్పుడే సంతోష పడ్డ. కొందరికి అవకాశాలు రావు. మీకు కూడా ఇదీ తీపి గుర్తుగా ఉంటుంది. కారుణ్య నియామకాలు మీ హక్కు. గత ప్రభుత్వం 2015 నుండి ఇవ్వలేదు. క్రమం తప్పకుండా చేయాల్సిన బాధ్యత ఇది.” అని సీఎం స్పష్టం చేశారు.
READ MORE: YouTube: ‘‘యూట్యూబ్’’ చూసి సొంతగా ఆపరేషన్ చేసుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
గతంలో కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి.. వెనకాల నుంచి కోర్టులో కేసులు వేయించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పదేళ్లు.. మీరు మీ కుటుంబమే పంచభక్ష పరమాన్నం తిన్నారని విమర్శించారు. “ఈ పిల్లలు సంతోషం మీకు పట్టలేదు. మీ ఇంట్లో మీ పిల్లలను నిజామాబాద్ ఎంపీ గా…కరీంనగర్ ఎంపీ గా ఓడిపోయారు. ఆరు నెలలు తిరగక ముందే కారుణ్య నియామకాలు చేశారు. మీకు పేదల మీద కారుణ్యం ఎందుకు చూపలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు.. గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు.. గత ప్రభుత్వం ఎన్ని నియామకాలు చేపట్టింది.. ఎన్ని పరీక్షలను సజావుగా నిర్వహించింది.. మీ కుటుంబ సభ్యుల సమక్షంలో నియామక పత్రాలు ఇచ్చింది మా ప్రభుత్వం.. 10 నెలల్లో మేము చేసిన పనులను.. 10 ఏళ్లలో మీరు ఎందుకు చేయలేదు.. ఈ నోటిఫికేషన్లు అన్నీ మేము ఇచ్చినవే అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.. మీ కుటుంబంలో వారిని ప్రజలు తిరస్కరిస్తే.. 6 నెలల్లోనే వేరే పదవులను కేసీఆర్ ఇచ్చారు. వాళ్ళ హయంలో పెదొలకు అనుమతులు కావాల్సి ఉండే. పెద్దోళ్ళ్ళకు అనుమతులు అసలే అక్కరకు లేదు అన్నట్టు పని చేశారు. భూమి చెరువులో ఉందా.. నాలాలో ఉందా.. తెలియదు. ఇప్పుడు ఎంత పెద్దోడు ఐనా.. బిల్డ్ నౌ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. పారదర్శక పాలన ఇవ్వాలని ఇవన్నీ చేస్తున్న. తెలంగాణ మోడల్ కావాలని న ఆలోచన. ” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.