టీటీడీ వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. రవీంద్ర భారతిలో బిల్డ్ నౌ పోర్టల్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి టీటీడీని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి సారి వాళ్ళని మా ఎమ్మె్ల్యే లెటర్ తో దర్శనం అడుక్కోవడం ఎందుకు? అని ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మాకు వైటీడీ ఉందన్నారు. భద్రాచలంలో రాముడు లేడా? అని ప్రశ్నించారు. మనకు శివుడి ఆలయాలు తక్కువా? అన్నారు. కేటీఆర్.. మిస్ ఇండియా పోటీలు ఇక్కడ ఎందుకు అంటున్నారని.. ఆయన బాధ ఏంటన్నారు. హైదరాబాద్ కి పర్యాటక సందడి వద్దా..? అని అడిగారు. ఇదో గొప్ప అవకాశమని స్పష్టం చేశారు. 72 వ సారి మనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
READ MORE: Bengaluru: “రోజుకు రూ. 5000 ఇస్తేనే భార్య సంసారం చేస్తుందట”.. మరీ ఇలా తయారవుతున్నారేంటి..
“3000 నేషనల్ ఛానల్స్ కి మనం ఆతిథ్యం ఇవ్వబోతోంది. మేము దుబారా ఖర్చులు చెయ్యం. ఐదో.. పది కోట్లు ఖర్చు చేస్తే.. హోటల్.. ఫుడ్ ఇండస్ట్రీకి రూ. వందల కోట్లు ఆదాయం వస్తుంది. ఫార్ములా ఈ రేసు కేసులో ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టవు. అందుకే కేసు ఎదుర్కొంటున్నావు. నాకు నీకు పోలికే లేదు. కేసీఆర్ మందు డోర్ డెలివరీ విధానం తెచ్చారు. నేను ఇసుక డోర్ డెలివరి చేస్తున్నా. గరం.. నరం.. బేషరం అనే విధానం మానుకోండి. గరం గరం గానే ఉండాలి. సీఎం అయ్యావు టెంపర్ మార్చుకో అని నాకు సూచనలు చేస్తున్నారు. నేను మార్చుకొను. జానారెడ్డి ఎంత హుందాగా ఉండేవారు.. ఆయన్ని ఏం చేశారు కేసీఆర్. నేను అలా ఉండను. నా విజన్ మారింది.. కానీ టెంపర్ మెంట్ మారలేదు. నేు అస్సలు మార్చుకోను.” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
READ MORE: Transgender Murder Case: అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ హత్య కేసులో నిందితుడు అరెస్ట్..