సోషల్ మీడియాలో సంచలనంగా మారిన పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ తాజాగా ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. తనపై, తన తల్లిపై నడుస్తున్న విమర్శలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా అన్వేష్ వ్యాఖ్యలపై ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇమ్రాన్ తన వీడియోలో మాట్లాడుతూ.. “నా తల్లిని ఉద్దేశించి అనవసరంగా వ్యాఖ్యలు చేయడం బాధించేస్తోంది. ఇది వ్యక్తిగత విమర్శలకు, కుటుంబ సభ్యులను లాగడానికి చాలా దారుణమైన ఉదాహరణ. నా అన్వేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి.” అని తెలిపారు.
READ MORE: Arete Hospitals: అరేటే హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘వరల్డ్ హెడ్ ఇంజ్యూరీ డే’ అవగాహన దినోత్సవం..
తన కుటుంబంపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలను తీవ్రంగా పరిగణించి, అన్వేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇమ్రాన్ సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. “ఇప్పటికే అన్వేష్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలి.” అని డిమాండ్ చేశారు. ఇమ్రాన్ తన పోస్ట్‌లో, అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా జత చేశారు. అలాగే, ఇతర టెలివిజన్ చానెల్స్ ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగ్స్‌ను కూడా తన పోస్ట్‌లో షేర్ చేశారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వేడెక్కిన నేపథ్యంలో, అన్వేష్‌పై నిజంగా చర్యలు తీసుకుంటారా? లేదా అనే చర్చ నడుస్తోంది.
READ MORE: Arete Hospitals: అరేటే హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ‘వరల్డ్ హెడ్ ఇంజ్యూరీ డే’ అవగాహన దినోత్సవం..