మహీంద్రా కొన్ని రోజుల క్రితం భారతదేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అవే.. ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ. విశేషమేమిటంటే కంపెనీ.. ఈ రెండింటికి సంబంధించిన బేస్ వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడించింది. మిగతా వేరియంట్ల ధరలు వెల్లడించలేదు. ఈ నెలలో కంపెనీ ఈ రెండు ఎస్‌యూవీల మొత్తం లైనప్ ధరలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు.
హోండా కార్స్ ఇండియా ఈ నెలలో తన పోర్ట్‌ఫోలియో లగ్జరీ సెడాన్ సిటీపై భారీ తగ్గింపులను తీసుకొచ్చింది. జనవరిలో ఈ సెడాన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 90 వేల నగదు తగ్గింపును పొందవచ్చు. వాస్తవానికి.. కంపెనీ సాధారణ వేరియంట్‌పై రూ. 73,000 వరకు ప్రయోజనాలను అందుబాటులో ఉంచింది. సిటీ ఈహెఈవీపై రూ. 90,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇదిలా ఉండగా.. జనవరిలో ఎప్పుడైనా కంపెనీ తన కార్ల ధరలను మళ్లీ పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకే ఈ కారును త్వరగా కొనడం ఉత్తమం.
కన్నతల్లినే అతి కిరాతకంగా హత్య చేసిందో కూతురు. కనికరం కూడా లేకుండా.. ఆగ్రహంతో క్రూరాతి క్రూరంగా అమ్మను హత్య చేసింది. ముంబైలోని కుర్లాలో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం.. నిందితురాలిని 41 ఏళ్ల రేష్మా ముజఫర్ ఖాజీగా గుర్తించారు. ఆమె తల్లి సబీరా బానో(62). ముంబ్రాలో తన కుమారుడితో కలిసి నివసిస్తున్న సబీరా బానో.. గురువారం ఖురేషీ నగర్‌లోని తన కుమార్తె రేష్మా ఇంటికి వెళ్లింది.
పామును చూడగానే మనుషులు వణికిపోతారు. పాములను చంపడానికి ఈ భయమే ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఏటా 50 లక్షల మంది పాముకాటుకి గురవుతున్నారు. అందులో దాదాపు 81 వేల నుంచి లక్షా 38 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో పాముకాటుకి గురై చనిపోతున్న వారి సంఖ్య భారత్‌లోనే అత్యధికంగా ఉంది. 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం..
న్యూ ఇయర్ తర్వాత కారు కొనాలకునే వారికి బ్యాడ్ న్యూస్.. ఎందుకంటే కార్ల కంపెనీలు జనవరి నుంచి ధరలు పెంచాయి. మారుతీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, ఎంజీ, నిస్సాన్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, ఆడి, వోల్వో కంపెనీలు కూడా రేట్లు పెంచుతున్నట్లు వెల్లడించాయి. ఏయే కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను పెంచాయో ఒకసారి చూద్దాం.
వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న సైన్యాన్ని కలిగి ఉంది. ఈ సైన్యాన్ని స్విస్ గార్డ్ అని పిలుస్తారు. ఈ ఆర్మీ సిబ్బందికి లభించే సౌకర్యాలు చదివితే మీరు ఆశ్చర్యపోతారు. వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఉంది. ఇక్కడ రోమన్ క్యాథలిక్ చర్చి ఉంది. పోప్ ఇక్కడే నివసిస్తున్నారు. వాటికన్ సిటీ చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం. దాదాపు 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ వెయ్యి మంది…
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-టీం ఇండియా జట్ల మధ్య ఐదో(చివరి)టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఈ ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆడడం లేదని వార్తలు వస్తున్నాయి. దీనిపై బీసీసీఐ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ తప్పుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ సిరీస్‌లో చివరి 3 మ్యాచ్‌ల్లో రోహిత్ పూర్తిగా నిరాశపరిచాడు.
దేశంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం కానుంది. జైల్లో ఉన్న ఖలిస్థానీ అమృతపాల్ సింగ్ ఇప్పుడు పంజాబ్‌లో పెద్ద రాజకీయ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జనవరి 14న రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ముక్త్సర్ సాహిబ్‌లో జరగనున్న మాఘీ జాతరలో అమృతపాల్ సింగ్ తన కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించనున్నారు. ఈ జాతరలో సిక్కు సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. లోహ్రీ సందర్భంగా నిర్వహించే ఈ మేళకు పంజాబ్‌లో చాలా ప్రాముఖ్యత ఉంది. అమృతపాల్ సింగ్ తండ్రి, అతని…
దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు కియా ద్వారా అనేక అద్భుతమైన వాహనాలు భారత మార్కెట్లో విక్రయించబడుతున్న సంగతి తెలిసిందే.. కాగా.. ఇటీవల ఇండియాలో తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే కంపెనీ మరో కొత్త వాహనాన్ని విడుదల చేసింది. అదే కియా సిరోస్ ఎస్యూవీ.. కియా మోటార్స్ జనవరి 3 నుంచి తన పోర్ట్‌ఫోలియోలో సరికొత్త సిరోస్ ఎస్యూవీ బుకింగ్‌ను ప్రారంభించనుంది. అంటే ఈరోజు అర్ధరాత్రి నుంచి దీని బుకింగ్ ప్రారంభం కానుంది.
మారుతీ సుజుకి ఇండియా దేశంలోనే ప్రతి సంవత్సరం కొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్న ఏకైక కంపెనీ. డిసెంబర్ 2024లో కూడా కంపెనీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. గత నెలలో కంపెనీ 2,52,693 యూనిట్ల అధిక రిటైల్ విక్రయాలను నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా 2.50 లక్షల యూనిట్ల నెలవారీ విక్రయాల్లో ఇది కొత్త మైలురాయి. ఈ సేల్‌లో దాదాపు 30 వేల యూనిట్ల స్విఫ్ట్ ఉన్నాయి.