మారుతీ సుజుకి 2024లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాను విడుదల చేసింది. అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాగన్ఆర్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కంపెనీ డేటా ప్రకారం.. జనవరి నుంచి డిసెంబర్ వరకు 1.98 లక్షల యూనిట్ల వ్యాగన్ఆర్ లను విక్రయించారు. అయితే కంపెనీకి చెందిన కార్లు ఏవీ 2 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును దాటలేకపోయాయి. విశేషమేమిటంటే.. వ్యాగన్ఆర్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కూడా అయ్యే అవకాశం ఉంది!
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని జనవరి 17న భారత్ మొబిలిటీ షోలో విడుదల కానుంది. కంపెనీ తాజాగా ఈ కొత్త ఈవీ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో కార్ కి సంబంధించి అనేక వివరాలు పంచుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 473 కి.మీ రేంజ్ వస్తుందని వీడియోలో పేర్కొన్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటనలో రేవతి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి బయటకు వచ్చారు.
న్యూయర్ రోజు తమకు ఇష్టమైన వారితో సంతోషంగా గడపాలని అందరు అనుకుంటారు.. పాత సంవత్సరాన్ని పంపించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని చాలా మంది అనుకుంటారు.. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గట్టిగా చేసుకున్నారు. డిసెంబర్ 31న జరిగిన అమ్మకాలు చూస్తేనే ఏ రేంజ్లో వేడుకలు జరిగాయో అర్థమవుతోంది.. భారీగా చికెన్ అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. రెస్టారెంట్లకు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. ఎప్పటి లాగానే మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఇక బార్లు, పబ్బులు ప్రజలతో కిటకిటలాడాయి.
రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణ పూర్తయింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధను 2 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. విచారణలో ఆమె సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందలేదు. మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాగా.. విచారణలో పోలీసులు 45 ప్రశ్నలు అడిగారు. గోడౌన్ నిర్వహణ అంతా మేనేజర్ మానస తేజ చూస్తారని ఆమె చెప్పింది
రేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆరు నెలల పాలన పూర్తి కావడంతో ప్రభుత్వం పారిశ్రామికంగా దూకుడు పెంచుతోంది. క్లీన్ఎనర్జీలో పెట్టుబడులు పెట్టెందుకు రాష్ట్రానికి భారీ కంపెనీలు రానున్నాయి.. రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాయి. దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే 2 లక్షల 50 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి.
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గనణీయంగా వృద్ధి చెందుతోంది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్‌తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకి సంస్థ తన ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తయారు చేసే పనిలో నిమగ్నమైంది. మారుతీ సుజుకికి చెందిన విటారాకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది.
పల్నాడు జిల్లా యలమంద గ్రామానికి చెందిన ఉల్లంగుల ఏడుకొండలుకు కలెక్టర్ పి.అరుణ్ బాబు ఎయిర్ కంప్రెషర్ అందజేశారు. ఉల్లంగుల ఏడుకొండలు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, వ్యాపారం చేసుకునేందుకు సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాన్ని.. జిల్లా కలెక్టర్ వెంటనే అమలు చేశారు. బుధవారం ఉదయం ఏడుకొండలు ఇంటిని సందర్శించిన కలెక్టర్ ఎయిర్ కంప్రెషర్ ను అందజేశారు.
నూతన సంవత్సరం వేళ ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో 1995 సీఎంను చూస్తారని చంద్రబాబు అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. తాను రాజకీయ కక్షలకు పాల్పడనని చెప్పారు. అలాగని.. తప్పు చేసే వాళ్లను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. సెకీ అంశం తనకు లాడ్డూ లాగే అనిపిస్తుందన్నారు.
హ్యుందాయ్ క్రెటా తన మునుపటి అమ్మకాల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఇది మాత్రమే కాదు.. మిడ్-సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఇది అవతరించింది. ఈ విభాగంలో బలమైన పోటీ ఉన్నప్పటికీ.. ఇది 2024 సంవత్సరంలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో మారుతి సుజుకి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైదర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగన్, ఎమ్జీ ఆస్టర్ వంటి మోడల్‌లు ఉన్నాయి. అయితే.. హ్యుందాయ్ క్రెటా…