మియాపూర్ బెట్టింగ్ యాప్స్ కేసుల వివరాలు సేకరిస్తున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందుగా యాప్స్ నిర్వహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మోరల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా సినీ సెలబ్రిటీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లని మియాపూర్ పోలీస్ స్టేషన్ కి పిలిపిస్తామన్నారు. బెట్టింగ్ యాప్స్ నిర్వహకులు.. పాన్ ఇండియా స్టార్స్ తో యాడ్స్ రూపంలో షూట్ చేసి వివిధ ప్లాట్ ఫామ్స్ లో ప్రమోట్ చేశారని తెలిపారు. యూట్యూబర్స్ , సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల వ్యక్తిగతంగా వివిధ సైట్లలో ప్రమోట్ చేయడమే కాకుండా వారి వ్యక్తిగత అకౌంట్లో కూడా బెట్టింగ్స్ యాప్ గురించి ప్రమోట్ చేశారని చెప్పారు. అలా చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2017 నుంచి తెలంగాణలో బెట్టింగ్స్ యాప్స్ పై నిషేధం ఉందని వెల్లడించారు. బెట్టింగ్స్ యాప్స్ నిర్వహకులతో వీరు ఏ ఏ పద్ధతుల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు అనేది తేల్చాల్సి ఉందని.. ఈ కేసులో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని వివరించారు.
READ MORE: Prakash Raj: నేను తప్పు చేశా కానీ.. బెట్టింగ్ యాప్స్ వివాదంపై స్పందించిన ప్రకాశ్ రాజ్..
ఇదిలా ఉండగా.. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ సహా బాలీవుడ్ నటీనటుల వరకు అందరిపైనా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న వారిపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదు చేశారు. టాలీవుడ్‌కు సంబంధించి నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్‌త పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
READ MORE: Guava Leaves: జామ పండ్లే కాదు.. ఆకులతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు..!