హైదరాబాద్ మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కనిపించడంపై మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై తన దృష్టికి వచ్చిన వెంటనే, తక్షణమే ఆ ప్రకటనలను తొలగించాల్సిందిగా ఎల్‌అండ్‌టీ, సంబంధిత యాడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. “కొన్ని మెట్రో రైళ్లపై బెట్టింగ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలు ఉన్నాయన్న అంశం నా దృష్టికి వచ్చింది. ఈ ప్రకటనలను వెంటనే తొలగించాలని సంబంధిత సంస్థలను ఆదేశించాను. ఈ రాత్రికే పూర్తిగా అటువంటి యాడ్స్‌ను తీసివేస్తారు” అని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రోలో ఇటువంటి ప్రకటనలు అనైతికమైనవని, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే అవకాశం ఉన్నందున వీటిని అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న యాడ్స్‌ను ఇకపై నిషేధించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
READ MORE: Betting Apps Case: ఇన్‌స్టాగ్రామ్‌లో పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఎమోషనల్ పోస్ట్.. బోరున విలపిస్తూ..
ఇదిలా ఉండగా.. తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కఠిన చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు టార్గెట్‌గా నిఘా ఉంచి, ఆ యాప్‌లను ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల ఐపీఎస్ అధికారి, ప్రస్తుత ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ఇప్పటి యువతను వేగంగా ఆకర్షిస్తోంది. ప్రాధమికంగా చిన్న మొత్తంలో డబ్బులు పెట్టి ఆడేలా ప్రోత్సహించినా, క్రమంగా ఇది వారిని తీవ్రమైన ఆర్థిక సమస్యల్లోకి నెట్టేస్తోంది. లాభాలు వస్తాయని భావించినవారు చివరకు అప్పులపాలై కుటుంబాల్ని కుదేలు చేసుకుంటున్నారు.
READ MORE: Pawan Kalyan: ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత సీఎం చంద్రబాబుదే..