తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2024లో రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంది. 170 మంది ప్రభుత్వ అధికారులు దుష్ప్రవర్తన, లంచం తీసుకుంటూ.. ఏసీబీకి దొరికి పోయారు. ఈ ఏడాది తెలంగాణలో అవినీతిపై ఏసీబీ ఛేదించిన కేసుల వివరాలు, సమాచారాన్ని తాజాగా పంచుకుంది. అవినీతిలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖలు అగ్రస్థానంలో ఉన్నట్లు వెల్లడించింది.
దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పందించారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. "డాక్టర్ మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త. పార్టీలకతీతంగా గౌరవించే వ్యక్తి. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి మా పార్టీ మద్దతు ఇచ్చింది. ఈరోజు అసెంబ్లీలో డాక్టర్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యను మేము అభినందిస్తున్నాం. భారతదేశానికి గౌరవప్రదంగా సేవ చేసిన ఏకైక ప్రధానమంత్రి పీవీ…
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆలయంలో దొంగతనానికి పాల్పడే ముందు దొంగ ఆలయ ప్రాంగణంలో కూర్చుని దేవుడికి పూజలు చేశాడు. దీని తరువాత.. ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహానికి అలంకరించిన కిరీటాన్ని దొంగిలించి పారిపోయాడు. ఈ చోరీ ఘటన అంతా ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.
మహారాష్ట్రలోని జల్నాలో క్రికెట్ ఆడుతూ ఓ క్రీడాకారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్య పరిచింది. జల్నాలోని డాక్టర్ ఫ్రేజర్ బాయ్స్ మైదానంలో క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన 'క్రిస్మస్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్'లో ఈ షాకింగ్ సంఘటన జరిగింది. ఆట ఆడుతూడగా.. మైదానంలో గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు.
బ్రిటిష్ ఆన్లైన్ వార్తాపత్రిక ది ఇండిపెండెంట్ ఇటీవల 21వ శతాబ్దపు 60 మంది ఉత్తమ నటుల జాబితాను విడుదల చేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని అత్యుత్తమ నటుల జాబితాలో భారతదేశం నుంచి ఒకరి పేరు మాత్రమే చేర్చారు. ఈ జాబితాలో తెలుగు యాక్టర్లు కాదు కదా.. బాలివుడ్ సీనియర్ నటులు అమితాబ్ బచ్చన్, షారుక్, సల్మాన్ ఖాన్ కు కూడా చోటు దక్కలేదు. ప్రస్తుతం ఈ లోకంలో లేని.. ఇర్ఫాన్ ఖాన్ ను చేర్చారు.
ఇటీవల ఆఫ్ఘనిస్థాన్పై పాకిస్థాన్ వైమానిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 46 మంది మరణించగా.. మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నారని.. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించారు. ఈ దాడి తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఇరువైపుల సైన్యాలు పరస్పరం సరిహద్దుల్లోకి ప్రవేశించి ప్రజలను చంపేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కొత్త యుద్ధం వచ్చే […]
అల్లు అర్జున్ సినిమా వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ అంశాన్ని ప్రభుత్వం తెర పైకి తెచ్చిందన్నారు. అందుకే రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళ పై మాట్లాడారని ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన మరణాలపైన రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చనిపోయిన గురుకుల పాఠశాల విద్యార్థులకు.. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
మన్మోహన్ సింగ్ మరణానంతరం పలు అంశాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య వివాదం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ విరుచుకుపడింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఒకవైపు దేశం మొత్తం సంతాపం వ్యక్తం చేస్తోందని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాహుల్ గాంధీ నూతన సంవత్సర వేడుకల కోసం వియత్నాం వెళ్లారని ఆరోపించింది. మన్మోహన్ సింగ్ చితాభస్మ నిమజ్జనానికి కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి చెందిన వారు ఎవరూ హాజరు కాలేదని బీజేపీ విమర్శించింది.
హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ ఎస్యూవీ క్రెటా ఈవీ విడుదల తేదీని ప్రకటించింది. కార్వాలే (CarWale) నివేదిక ప్రకారం.. 17 జనవరి 2025న జరగబోయే భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో ఈ వాహనాన్ని ప్రదర్శించనున్నారు. క్రెటా ఈవీ భారతదేశంలో హ్యుందాయ్ బ్రాండ్ యొక్క మూడవ ఎలక్ట్రిక్ వాహనం. పవర్, రేంజ్లో కొత్త మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం..
తమిళనాడులోని తిరుచ్చి విమానాశ్రయంలో తాబేళ్ల అక్రమ రవాణాను కస్టమ్స్ శాఖ బట్టబయలు చేసింది. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన పార్శిల్ నుంచి 2447 బతికున్న తాబేళ్లను కస్టమ్స్ బృందం స్వాధీనం చేసుకుంది. ఈ తాబేళ్లను కౌలాలంపూర్ నుంచి భారత్కు అక్రమంగా రవాణా చేశారు.