చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. వివో కంపెనీ రూ.62,476 కోట్ల మేర ఇంకమ్ ట్యాక్స్ చెల్లించకుండా ఆ మొత్తం డబ్బులను చైనాకు తరలించిందని ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఇండియాలోని 23 రాష్ట్రాల్లో 48 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ నటించిన ప్రకటనలు టెలీకాస్ట్‌కు సిద్ధంగా ఉండగా వాటిని తాజాగా వివో యాజమాన్యం నిలిపివేసింది. అయితే ఇది తాత్కాలిక […]
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అని జోస్యం చెప్పారు. ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 95 శాతం హామీలను అమలు చేసిన వ్యక్తిగా సీఎం జగన్ చరిత్రలో […]
వైసీపీ ప్లీనరీలో టీడీపీ అధినేత చంద్రబాబు వేలి ఉంగరంలో చిప్ ఉండటంపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వారి బాగోగుల గురించి ఆలోచించే చిప్ మెదడు, గుండెలో ఉండాలి కానీ.. చంద్రబాబు చేతి రింగులోనో, మోకాలిలోనో, అరికాలిలోనో ఉంటే లాభం ఉండదని జగన్ వ్యాఖ్యానించారు. గుండె, మెదడులోనూ చిప్ ఉంటే.. అప్పుడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని జగన్ […]
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఒళ్లు కాలి మరొకడు ఏడ్చాడని వెనుకటికి ఒక సామెత ఉంది. ఇప్పుడు ఈ సామెత హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్‌కు సరిగ్గా సరిపోతుంది. ఉన్నోడు కార్లలో తిరుగుతూ ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతుంటే.. లేనోడు బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌జామ్‌లలో ఇరుక్కుపోయి నానా అవస్థలు పడుతున్నాడు. ట్రాఫిక్‌జామ్‌కు భారీ వర్షాలే కారణమని వాదించవచ్చు. కానీ అది 30 శాతం మాత్రమే. మిగతా 70 శాతం నానాటికీ పెరుగుతున్న కార్ల ట్రాఫిక్‌ను ప్రభుత్వాధికారులు అదుపు చేయలేకపోవడం […]
కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఓదార్పు యాత్ర చేయవద్దన్న పార్టీని తాను వ్యతిరేకించినందుకు తనపై అక్రమ కేసులు పెట్టారని జగన్ ఆరోపించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలోని శక్తివంతమైన వ్యవస్థలను తనపై ఉసిగొల్పాయని.. అన్యాయమైన ఆరోపణలు చేయించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయించారన్నారు. ఆనాడు వాళ్లకు లొంగిపోయి ఉంటే ఈనాడు జగన్ మీ ముందు ఇలా ఉండేవాడు కాదని వ్యాఖ్యానించారు. తనను టార్గెట్ చేసిన పార్టీ ఈరోజు నామరూపాల్లేకుండా పోయిందని […]
గురువారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ సన్నాహాల కోసం ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులోకి రానున్నాడు. ఇటీవల కరోనా బారిన పడిన అతడు కోలుకుని రెండు రోజుల కిందటే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీంతో టీ20 సిరీస్‌లో అతడు బరిలోకి దిగడం ఖాయమైంది. రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుండటంతో రోహిత్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడాడు. […]
రాష్ట్రవ్యాప్తంగా 659 అద్దె బస్సులు ప్రవేశపెట్టేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ టెండర్లు ఆహ్వానించింది. 203 పల్లె వెలుగు, 208 ఆల్ట్రా పల్లె వెలుగు, 39 మెట్రో ఎక్స్‌ప్రెస్, 70 ఎక్స్‌ప్రెస్, 22 అల్ట్రా డీలక్స్, 46 సూపర్ లగ్జరీ, 9 ఏసీ స్లీపర్, 47 నాన్ ఏసీ స్లీపర్, 6 ఇంద్ర బస్సులు, 9 సిటీ ఆర్డినరీ బస్సులకు ఆర్టీసీ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. జిల్లాల వారీగా అద్దె బస్సులు, సంఖ్యను నిర్ణయించి ఈ మేరకు టెండర్లను ఆహ్వానించారు. నేటి […]
చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన మినీ మహానాడులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని తిరిగి కాపాడుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని దోచుకున్న వైసీపీకి బుద్ధి చెప్పే సమయం దగ్గర పడిందన్నారు. లేని సమస్యలు సృష్టించి మరీ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తాను సభ రాకుండా అక్రమ కేసుకు పెడుతారా.. వైసీపీ దొంగల్లారా… తాను కనుకగా కన్నెర్ర చేస్తే ఇంటిలో నుండి బయటకు కూడా రాలేరన్నారు. […]
రామ్ హీరోగా నటించిన ది వారియర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలోని సత్యం థియేటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి తమిళ హీరోలందరూ తరలివచ్చారు. విశాల్, ఆర్య, కార్తీ, మణిరత్నం, భారతీరాజా, ఆర్కే సెల్వమణి, విక్రమన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ఆర్య మాట్లాడుతూ.. దర్శకుడు లింగుసామి తెలుగు, తమిళంలో ది వారియర్ సినిమాను తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయనకు ఈ సినిమా పెద్ద హిట్ అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆర్య మాట్లాడాడు. […]
భారత్-ఇంగ్లండ్ చివరి టెస్ట్ ముగిసిన తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఈ మ్యాచ్ రెండు ఇ న్నింగ్స్‌లలోనూ కోహ్లీ విఫలం కావడంతో అతడి ర్యాంక్ పడిపోయింది. దీంతో ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఐసీసీ టాప్-10లో విరాట్ కోహ్లీ పేరు గల్లంతయ్యింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 11, 20 స్కోర్లు చేసిన కోహ్లి తాజా టెస్టు ర్యాంకుల్లో 13వ స్థానానికి దిగజారాడు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. […]