అంతర్జాతీయ టీ20ల్లో భారత్ ఖాతాలో మరో సిరీస్ చేరింది. శనివారం నాడు ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 49 పరుగుల తేడాతో ఆతిధ్య జట్టును టీమిండియా మట్టికరిపించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన […]
ఈ ఏడాది జూలై 10వ తేదీకి ఓ విశిష్టత ఉంది. ఆదివారం నాడు తొలి ఏకాదశి పండగ. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమహావిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే శ్రీమహావిష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు […]
వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త ఛాంపియన్ అవతరించింది. కజకిస్థాన్ యువ సంచలనం ఎలెనా రిబకినా శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్లో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్‌పై 2-6, 6-3, 6-3 స్కోరు తేడాతో ఎలెనా రిబకినా విజయం సాధించింది. ఈ టైటిల్ సమయంలో మెదటి సెట్ కోల్పోయిన రిబకినా తన ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఆ తర్వాతి రెండు సెట్లను వరుసగా గెలిచి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది. Read […]
టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీపై మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంతకాలంగా పరుగులు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న కోహ్లీని టీ20ల నుంచి తప్పించాలని సెలక్టర్లకు కపిల్ దేవ్ సూచించాడు. అశ్విన్ వంటి మేటి బౌలర్‌నే తప్పించినప్పుడు కోహ్లీని ఎందుకు పక్కనబెట్టరని ప్రశ్నించాడు. అశ్విన్ టెస్టుల్లో వరల్డ్ నంబర్ 2 ఆటగాడు అని… అలాంటి ఆటగాడినే పక్కనపెట్టారని.. కోహ్లీకి కూడా ఇదే పరిస్థితి వస్తుందని కపిల్ జోస్యం చెప్పాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ […]
సాధారణంగా పచ్చగా, ఏపుగా పెరిగే మొక్కలను అందరూ ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో చూసేందుకు అందంగా కనిపించే కోనో కార్పస్ అనే మొక్కను కూడా గతంలో చాలా మంది రోడ్డు డివైడర్ల మధ్యలో, నర్సరీల్లో, ఇళ్లల్లోనూ పెంచుతున్నారు. ఈ మొక్క నాటిన కొన్ని వారాల్లో ఏపుగా పెరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో ఈ మొక్కలు నాటవద్దని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లపై, నర్సరీలలో, ఇళ్లల్లో ఎక్కడా ఈ మొక్కలను పెంచవద్దని నిషేధం విధించారు. ఈ మొక్కల కారణంగా […]
బర్మింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ టీమ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టీమిండియ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. తొలి టీ20లో టాస్ గెలిచిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా భారీ స్కోరు చేయడంతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. ఇషాన్ కిషన్ స్థానంలో విరాట్ కోహ్లీ, దీపక్ హుడా స్థానంలో రిషబ్ పంత్, […]
వైసీపీ ప్లీనరీ ద్వారా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కారం కాదన్నారు. వైసీపీ నేతలు మాట్లాడే భాష కనీసం మర్యాదపూర్వకంగా ఉండటం లేదని.. ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ చేపట్టిన గడప గడపకు కార్యక్రమం ఫెయిల్యూర్ కావడంతో సీఎం జగన్ ఫస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. 1.27 లక్షల కోట్లు ఏపీలోని రైతాంగాన్ని ఆదుకున్నామని […]
ఆగస్టులో శ్రీలంక వేదికగా ఆసియా కప్ 2022 టోర్నీ జరగనుంది. అయితే ఇదే సమయంలో జింబాబ్వేలో మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా పర్యటించాల్సి ఉంది. ఒకే సమయంలో రెండు పర్యటనలు ఉండటంతో ఆసియా కప్‌కు రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ల జట్టును, జింబాబ్వేకు జూనియర్ల జట్టును పంపించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఆసియా కప్‌లో పాల్గొనే టీమ్‌కు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా.. జింబాబ్వే పర్యటనకు వెళ్లే బీ టీమ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. […]
భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్యసేన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. అయితే వైద్యుల సలహా మేరకు దేశ రాజధాని ఢిల్లీ శాంతినికేతన్‌లోని తన ఇంటిలో ఐసోలేషన్ ఉండి చికిత్స పొందుతున్నారు. అమర్త్యసేన్ శనివారం శాంతినికేతన్ ఇంటి నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సి ఉంది. ఆయన కోల్‌కతాలో జరిగే ఒక కార్యక్రమానికి హాజరు […]