ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీపై ఆరోపణలు చేశారు. టీడీపీకి రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బిజినెస్ ర్యాంకులపై టీడీపీ విమర్శలు చేస్తోందని.. మళ్లీ అధికారంలోకి రావాలన్న తాపత్రయం మినహా టీడీపీకి మరో ఆలోచన లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నాలుగు పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్లు పెట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు […]
ఈనెల 8,9వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు వైసీపీ ప్లీనరీ అజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఈనెల 8న ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు సభ్యుల రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10:10 గంటలకు పార్టీ జెండాను వైసీపీ […]
పేదపిల్లలకు ప్రభుత్వ విద్యను దూరం చేయవద్దని కోరుతూ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. జాతీయ విద్యావిధానం, పాఠశాలల విలీనంతో పేదపిల్లలకు ప్రభుత్వ విద్య దూరం చేయవద్దని ఆయన లేఖలో కోరారు. పాఠశాలల ప్రారంభం రోజునే లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారిందని లోకేష్ ఆరోపించారు. ఆగమేఘాలపై జాతీయ విద్యా విధానం అమలు, పాఠశాలల విలీనంపై తీసుకున్న నిర్ణయం పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు […]
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ మాత్రం తమ వైఖరిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ వైఖరిని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తమకు ఎర్రకోట మీద జెండా ఎగరేయాలని, ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉన్నాయని తెలిపారు. […]
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 616 పాయింట్ల లాభంతో 53,750 వద్ద ముగియగా.. నిఫ్టీ 178 పాయింట్ల లాభంతో 15,989 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో ఉదయం నుంచి లాభాల్లోనే ట్రేడయిన మార్కెట్లు చివరి వరకు అదే ఊపును కొనసాగించాయి. సెన్సెక్స్‌లో బ్రిటానియా, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాలను ఆర్జించగా… ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, […]
ఈనెల 22 నుంచి టీమిండియా వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ మేరకు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు పాల్గొంటుంది. ఈ పర్యటనకు తాజాగా టీమిండియాను సెలక్టర్లు ప్రకటించారు. ఈ సిరీస్‌కు అగ్రశ్రేణి ఆటగాళ్లకు విశ్రాంతి కల్పి్ంచారు. త్వరలో ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్లను బీసీసీఐ రొటేటింగ్ చేస్తోంది. దీంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, బుమ్రా, భువనేశ్వర్, హార్డిక్ పాండ్యా వంటి ఆటగాళ్లకు […]
ముద్దు అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఎవరైనా ఎదుటి వారిపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ముద్దు పెడుతుంటారు. తల్లీ బిడ్డల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య ముద్దు అనేది అన్యోన్యతను పెంచే సాధనం. ముద్దు అనేది ఒక ఆనందకరమైన అనుభవమని, వ్యక్తుల సాన్నిహిత్యాన్ని వ్యక్తీకరణ చేస్తుందని తెలియజేయడంకోసం ప్రతి ఏడాది జూలై 6వ తేదీన అంతర్జాతీయ ముద్దు దినోత్సవం నిర్వహించబడుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదలైన ఈ దినోత్సవం 2000లో […]
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సమకాలీన ఆటగాళ్లలో కోహ్లీ, స్మిత్, రూట్, విలియమ్సన్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అత్యుత్తమ ఆటగాళ్లుగా చలామణి అవుతున్నారు. కానీ వీరిలో విరాట్ కోహ్లీ మాత్రం గత మూడేళ్లుగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. పరుగుల యంత్రం కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ ఆడుతున్నా సెంచరీ చేసి మూడేళ్లు దాటిపోతోంది. పేలవ ఫామ్ కారణంగా కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక ఆటగాడిగా […]
డేటా చౌర్యంపై అమరావతిలోని సచివాలయంలో హౌస్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సాధికార సర్వే ద్వారా వచ్చిన సమాచారం సేవా మిత్ర అనే ప్రైవేట్ సంస్థకి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించారని.. పార్టీ కార్యకర్తలకు ఇచ్చి తమకు అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగించాలని చూశారని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. డేటా చౌర్యం వెనుక చాలా పెద్దవాళ్ళ సహకారం […]