* నేడు ప్రపంచ జనాభా దినోత్సవం * తిరుమల: ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం, 75 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న పాలకమండలి * విజయవాడ: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై మూడు రోజుల పాటు శాఖాంబరి ఉత్సవాలు.. 12 టన్నుల పళ్లు, కాయగూరలు, ఆకుకూరలతో ఆలయ ప్రాంగణం అలంకరణ * నంద్యాల జిల్లా: నేడు శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం * విశాఖ: నేటి నుంచి మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ […]
నాటింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 216 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేసింది. ఓ దశలో ఓడిపోతుందని అభిమానులు భావించారు. అయితే భారత శిబిరంలో సూర్యకుమార్ ఆశలు రేకెత్తించాడు. అతడు ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడి మెరుపు సెంచరీ చేశాడు. 55 బంతుల్లో 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 117 పరుగులు చేసి […]
నాటింగ్ హామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు బట్లర్ (18), జాసన్ రాయ్ (27) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీళ్లిద్దరూ అవుటైనా డేవిడ్ మలన్ (77), లివింగ్‌స్టోన్ (42 నాటౌట్) ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, […]
విజయవాడలో మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జనసేన ఆధ్వర్యంలో జనవాణి రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టగా స్థానికుల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని జనవాణి కార్యక్రమం ద్వారా తాము చేస్తున్నామని తెలిపారు. వైసీపీ సర్కారు తన బాధ్యతలను మర్చిపోయిందని.. దీంతో సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు నేడు నలిగిపోతున్నారని పవన్ ఆరోపించారు. తాను సంపూర్ణంగా ప్రజల పక్షాన నిలబడేందుకు వచ్చానని భరోసా ఇచ్చారు. […]
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల పర్యటనలలో భాగంగా ఈనెల 12న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాలకు రానున్నారు. ఏపీ పర్యటనలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆమె తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు. సీఎం జగన్ నివాసంలో ద్రౌపది ముర్ముకు తేనీటి విందు ఏర్పాటు […]
టీ20 మ్యాచ్‌లలో బౌలర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. బ్యాటింగ్ చేసేవాళ్లు సిక్సులు, ఫోర్ల బాదడమే పనిగా పెట్టుకోవడంతో బౌలర్లు చెత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మాట్ మెకరైన్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. విటాలిటీ టీ20 2022 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా సోమర్‌సెట్, డెర్బీషైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన డెర్బీషైర్ మెకరైన్ ఏకంగా 82 పరుగులు సమర్పించుకున్నాడు. తన […]
ప్రకాశం జిల్లా పర్యటనలో మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీని, వైఎస్ఆర్ కుటుంబాన్ని వేర్వేరుగా చూడలేమని తెలిపారు. విజయమ్మ గౌరవ అధ్యక్షురాలి పదవికి ఎందుకు రాజీనామా చేస్తున్నారో వివరించారని.. అయినా ఈ విషయంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైఎస్ఆర్‌సీపీ అనేది జగన్ కష్టంతో ఎదిగిన పార్టీ అని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్లీనరీకి వచ్చిన జనాన్ని చూసి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిందని.. దీంతో పిచ్చిపిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని ఒక వర్గానికి ధారాదత్తం చేశారని ఆరోపించారు. […]
తెలంగాణలో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో రేపటి నుంచి అంటే జూలై 11 నుంచి జూలై 13 వరకు మూడ్రోజుల పాటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. Read Also: Amaranath Yatra: ఇద్దరు ఏపీ యాత్రికులు గల్లంతు.. ఏపీ సర్కార్ ప్రకటన మరోవైపు తెలంగాణలో […]