2026 Kawasaki Ninja 650: కవాసకి (Kawasaki) ఇండియాకు చెందిన ప్రసిద్ధ మిడ్ వెయిట్ స్పోర్ట్ టూరింగ్ మోటార్‌సైకిల్ 2026 నింజా 650 (2026 Kawasaki Ninja 650)ని భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.91 లక్షలుగా నిర్ణయించబడింది. ఈ కొత్త వేరియంట్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చోటు చేసుకోలేదు. ఇది ప్రస్తుత MY25 వెర్షన్‌తో పాటు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ మోడల్‌కు చాలా కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారతదేశంలో మాత్రం లైమ్ గ్రీన్ పెయింట్ తో వైట్ అండ్ బ్లూ గ్రాఫిక్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతర్జాతీయంగా మాత్ గ్రే, బ్లాక్ కలర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. MY25 వెర్షన్ లైమ్ గ్రీన్‌తో ఎబోనీ,పెర్ల్ బ్లిజార్డ్ వైట్ కలర్ స్కీమ్‌లతో కొనసాగుతుంది.
Indians Doctors Leaving UK: ఆ దేశంలో బిచ్చగాళ్లుగా మారుతున్న భారతీయ డాక్టర్లు.. తెల్లదొరలకు బై బై!
2026 నింజా 650లో కొన్ని ముఖ్యమైన అప్‌గ్రేడ్లు ఉన్నాయి. ఈ బైక్‌లో 4.3 అంగుళాల TFT స్క్రీన్ ఉంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఇంటిగ్రేషన్ సాధ్యమవుతుంది. వీటితోపాటు LED లైటింగ్, ట్రాక్షన్ కంట్రోల్ (రెండు మోడ్లు), డ్యూయల్ థ్రాటిల్ వాల్వ్స్, ABS వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇంజన్ విషయంలో ఎలాంటి మార్పు లేదు. 649cc లిక్విడ్-కూల్డ్ పారలల్-ట్విన్ ఇంజన్ ఈ బైక్ 8,000 rpm వద్ద 67 bhp పవర్, 6,700 rpm వద్ద 64 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. పవర్ ట్రాన్స్‌మిషన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ ఉపయోగిస్తున్నారు.
90Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో బడ్జెట్ సెగ్మెంట్‌లో HMD Pulse 2 లాంచ్‌కు సిద్ధం..!
వీల్స్ హై-టెన్సైల్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ పై ఆధారపడి ఉంది. సస్పెన్షన్ విషయంలో ముందు 41 mm టెలిస్కోపిక్ ఫోర్క్స్ (125 mm వీల్ ట్రావెల్), వెనుక మోనోషాక్ (130 mm వీల్ ట్రావెల్) ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు 300 mm డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, వెనుక 220 mm సింగిల్ డిస్క్ ఉన్నాయి. ఈ బైక్ 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ పై నడుస్తుంది. ఈ మోటార్ సైకిల్ 1,410 mm వీల్‌బేస్, 130 mm గ్రౌండ్ క్లియరెన్స్, 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 790 mm సీటు ఎత్తు కలిగి ఉంది. కర్బ్ వెయిట్ 196 kgగా ఉంది.